YSRCP Leaders: డ్రమ్ముకు నల్లా పెట్టి మద్యం పంపిణీ.. పోలీసుల మౌనానికి కారణం అదేనా?

మద్యం దుకాణాలను నిషేధించాలని మహిళలు, విద్యార్థులు ధర్నాలు చేస్తున్నా వాటకి అడ్డుకట్ట పడటం లేదు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రలో మద్యం విచ్చలవిడిగా లభిస్తోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సీఎం జగన్‌ ప్రోద్బలంతో కొందరు సొంతంగా కల్తీ మద్యం తయారుచేసి వాటికి స్టిక్కర్లు పెట్టి అమ్ముతున్నారని ప్రతిపక్ష నాయకులు గతంలో ధర్నాలు చేపట్టారు.సీఎం జగన్‌ ఇంటి సమీపంలో జరిగిన ఘటనకు సంబం«ధించిన ఓ వీడియో వైరల్‌ అవుతోంది.

తాడేపల్లిలో వినాయకుని ఊరేగింపు సందర్భంగా మద్యం విచ్చలవిడిగా పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి నివాసానికి కిలోమీటర్‌ దూరం లో ఉన్న తాడేపల్లి గేటు సెంటర్‌ వద్ద వినాయకుని ఊరేగింపులో విచ్చలవిడిగా మద్యం పంపిణీ చేస్తున్నారు. ట్రాక్టర్‌పై ఓ డ్రమ్ము ఏర్పాటు చేసి అందులో మద్యం పోసి దానికి నల్లా బిగించి వైసీపీ నేతలు బహిరంగంగా మద్యం పంపిణీ చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బహిరంగంగా మద్యం పంపిణీ చేస్తే కఠిన చర్యలు తీసుకోవాల్సిన అధికారులు, పోలీసులు చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తాడేపల్లి పట్టణ అధ్యకుడు బర్రముక్కు వేణుగోపాల స్వామి రెడ్డి వినాయక ఉత్సవానికి ధర్మకర్తగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యమంత్రి నివాసానికి అతీ సమీపంలోనే మద్యం విచ్చలవిడిగా పంపిణీ చేస్తున్నారంటే.. ఇక రాష్ట్రంలో ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చని ఈ వీడియోపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. మందు పంపిణీ దృశ్యాలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఆబ్కారీ పోలీసుల మౌనం వెనక అర్థమెంటోనని స్థానికులు గుసగుసలాడుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -