Rashmika: విజయ్ తో అఫైర్ పై ముసిముసి నవ్వులు నవ్విన రష్మిక.. ఏమైందంటే?

Rashmika: తెలుగు రాష్ట్రాల ప్రజలకు కన్నడ బ్యూటీ రష్మిక మందన్న గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఛలో సినిమాతో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన రష్మిక మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులతో మంచి ర్యాపో సంపాదించుకుంది. ఆ తర్వాత వచ్చిన గీత గోవిందం సినిమాలో విజయ్ దేవరకొండ సరసన నటించి తెలుగు ప్రేక్షకులను మరో స్థాయిలో ఆకట్టుకుంది. ఇక ఈ అమ్మడు తన అందంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది.

ఆ తర్వాత వరుస సినిమా ఆఫర్లు అందుకుంటూ తెలుగు ఇండస్ట్రీలో నటిగా తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకుంది. ఇక ఇటీవల ప్రేక్షకులు ముందుకు వచ్చిన పుష్ప సినిమాతో ఈ అమ్మడు వరల్డ్ వైడ్ గా ప్రేక్షకులను ఫిదా చేసింది. ప్రపంచ స్థాయి ప్రేక్షకులతో పుష్ప సినిమా ద్వారా మంచి ర్యాపో పెంచుకుంది. ఈ క్రమంలో రష్మిక వరుస సినిమా ఆఫర్లు అందుకుంటూ కెరీర్ పరంగా ఒక రేంజ్ లో దూసుకుపోతుంది. అయితే గతంలో విజయ్ దేవరకొండ, రష్మికలు రిలేషన్ లో ఉన్నారు అని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి.

కానీ ఈ విషయం గురించి అటు రష్మిక గాని.. ఇటు దేవరకొండ గానీ ఎవరు స్పందించలేదు. ఇదిలా ఉంటే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మిక విజయ్ దేవరకొండ తో తన లవ్ ఎఫైర్ గురించి వచ్చిన పుకార్ల గురించి స్పందించింది. మేమిద్దరం గీతాగోవిందం సినిమా సమయంలో మంచి ఫ్రెండ్స్ గా మారాము. హైదరాబాదులో నాకు చాలామంది స్నేహితులు ఉన్నారు. వారిలో విజయ్ కి నాకు కామన్ స్నేహితులు ఉన్నారు.

అందువల్ల అక్కడికి వెళ్ళిన సమయంలో బాగా ఎంజాయ్ చేస్తాం. అంతేతప్ప అంతకుమించి మా ఇద్దరి మధ్య ఏమీ లేదని ఈ అమ్మడు తెలిపింది. ఇక మా ఇద్దరి గురించి లవ్ అంటూ, పెళ్లి అంటూ వచ్చే పుకార్లు చాలా క్యూట్ అనిపిస్తున్నాయి అని రష్మిక ఆ ఇంటర్వ్యూలో ముసి ముసి నవ్వులు నవ్వుతూ మురిసిపోయింది. అంటే రష్మికకు విజయ్ అంటే ఇష్టం ఉందా అని అనుమానాలు వస్తున్నాయి. ఏదేమైనా రష్మిక ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో హీరోయిన్ హడావిడి చేస్తుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -