Prabhas – Rashmika: ప్రభాస్ రష్మిక కాంబినేషన్ పై నెటిజన్ల రియాక్షన్ ఇదే!

Prabhas – Rashmika: తెలుగు పరిశ్రమ రేంజ్ ని హాలీవుడ్ కి తీసుకువెళ్లిన టాలీవుడ్ స్టార్స్ లలో ప్రభాస్ మొదటివాడని చెప్పవచ్చు. బాహుబలి తరువాత అన్ని భారీ బడ్జెట్ సినిమాలనే చేస్తూ ప్రపంచవ్యాప్తంగా తన సత్తాని చాటుతున్నాడు ప్రభాస్. ప్రస్తుతం కల్కి 2898 ఏడి, సలార్ 2, రాజా సాబ్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రాబోయే స్పిరిట్ సినిమాలో కూడా నటిస్తున్నాడు ప్రభాస్.

 

మరొకవైపు రష్మిక కి పుష్ప ఇచ్చిన కిక్కు తో దెబ్బకి బాలీవుడ్ లో వెళ్లి పడింది. అక్కడ యానిమల్ సినిమాతో సాలిడ్ హిట్ కొట్టి మంచి ఫామ్ లో ఉంది రష్మిక. ఇప్పుడు పుష్ప టు సినిమా షూటింగ్ లో బిజీగా ఉంది ఈ భామ. అయితే అసలు విషయం ఏమిటంటే ఇప్పుడు ప్రభాస్ హీరోగా నటించబోతున్న సినిమా స్పిరిట్ లో రష్మిక హీరోయిన్ గా సెలెక్ట్ అయింది. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో హీరోయిన్ విషయంలో ఎన్నో వార్తలు వెలువడ్డాయి.

అయితే చివరిగా ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక నటిస్తుందని తెలిసింది. స్పిరిట్ మూవీ భారీ యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో రూపొందనున్నట్లు కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతుంది. అందుకు అనుగుణంగానే టైటిల్ పై స్టార్స్ ఉండటంతో ఇది పోలీస్ కథతో వస్తుందని అర్థమైంది. రష్మిక మందన్నా కు ఇప్పటికే స్పిరిట్ మూవీకి సంబంధించిన స్క్రిప్టును సందీప్ రెడ్డి వంగా వినిపించాడంట అది బాగా నచ్చటంతో ఆమె పచ్చ జెండా ఊపినట్లు తెలిపింది.ప్రభాస్ కాంబినేషన్లో ఆమెకి ఇది మొదటి సినిమా.

 

అయితే డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ తో ఆమెకి ఇది రెండవ సినిమా ఆమె ఇంతకుముందు సందీప్ రెడ్డితో అనిమల్ సినిమా చేసింది. ఆ సినిమాలో గీతాంజలిగా రష్మిక జీవించేసిందనే చెప్పాలి. ఆ నటనకే ఇన్స్పైర్ అయ్యి సందీప్ రష్మిక ని ఈ సినిమాలో హీరోయిన్ గా తీసుకున్నాడంట. అయితే ప్రభాస్ కి జోడిగా రష్మిక అవసరమా అంటూ రియాక్ట్ అవుతున్నారు నెటిజన్స్ మరి దీని మీద డైరెక్టర్ ఎలా స్పందిస్తాడో చూడాలి.

Related Articles

ట్రేండింగ్

Union Minister Piyush Goyal: వైఎస్సార్ ను సైతం ముంచేసిన సీఎం జగన్.. ఆ కేసులో కావాలనే ఇరికించారా?

Union Minister Piyush Goyal: వైయస్సార్ కాలనీ పట్ల కేంద్రమంత్రి పియూష్ గోయెల్ తన ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలో పీయూష్ గోయల్ విలేకరులతో మాట్లాడుతూ జగన్ పాలనపట్ల విరుచుకుపడ్డారు. వైయస్సార్ కాంగ్రెస్...
- Advertisement -
- Advertisement -