Godfather: గాడ్ ఫాదర్ సినిమా బ్లాక్ బస్టర్ కాకపోవడానికి 5 కారణాలు ఇవేనా?

Godfather: తెలుగు ప్రేక్షకులకు మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమా గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. మలయాళం లో లూసిఫర్ చిత్రాన్ని రీమేక్ చేస్తూ తెలుగులో గాడ్ ఫాదర్ గా తీర్చిదిద్దాడు డైరెక్టర్ మోహన్ రాజా. ఈ సినిమాలో చిరంజీవి, నయనతార, బాలీవుడ్ కండలధీరుడు సల్మాన్ ఖాన్ లు ప్రధాన పాత్రలు పోషించారు.

కాగా ఈ సినిమాకు భారీ స్థాయిలో అంచనాలు పెరిగాయి. గతంలో విడుదలైన ఆచార్య సినిమా పూర్తిగా డిజాస్టర్ కావడంతో మెగా అభిమానులు మొత్తం గాడ్ ఫాదర్ సినిమాపై ఆశలు పెట్టుకున్నారు. ఇక కొందరు చిరంజీవి స్టోరీ ఎంచుకోవడం లో వెనుకబడి ఉన్నాడని, అందుకే సినిమాలు పూర్తిగా ప్లాప్ అవుతున్నాయి అంటున్నారు. కాగా ఇటువంటి వారికి మెగాస్టార్ గాడ్ ఫాదర్ సినిమాతో సమాధానం చెబుతాడని మెగాస్టార్ అభిమానులు చెప్పుకున్నారు.

ఇక ఈ సినిమా ఈరోజు అనగా అక్టోబర్ 5 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కాదని తెలుస్తుంది. కానీ సినిమా హిట్ అని అర్థమవుతుంది. అయితే ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కాకపోవడానికి కొన్ని కారణాలు వెలుగులోకి వచ్చాయి. అవేమిటంటే మొదటిగా కథ కథనం కొత్తగా లేకపోవడం వలన ఈ సినిమా జనాలను ఆకట్టుకోలేకపోయింది. ఇక మ్యూజిక్ కూడా అంత ప్రత్యేకంగా అనిపించడం లేదట.

ఇక పస్ట్ ఆఫ్ లోని కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు. ఇక సల్మాన్ ఖాన్ యాక్టింగ్ కూడా ప్రేక్షకులకు అంతగా ఏమీ అనిపించలేదట. ఓవరాల్ గా చూసుకుంటే లూసిఫర్ సినిమాతో పోలిస్తే కొన్ని సీన్స్ విషయంలో గాడ్ ఫాదర్ సినిమా ఆకట్టుకోలేకపోయింది. అయితే ముందుగానే ఈ సినిమా గురించి నానా రకాల విమర్శలు వచ్చాయి. అయినా కానీ చిరంజీవి ఎంతో కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. మరి ఈ విషయం గురించి మెగాస్టార్ చిరంజీవి ఏ విధంగా స్పందిస్తాడో చూడాలి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -