Waltair Veerayya: తమిళంలో ఆ రికార్డ్ ను క్రియేట్ చేయడం మెగాస్టార్ చిరంజీవికి సాధ్యమేనా?

Waltair Veerayya: టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి గురించి మనందరికీ తెలిసిందే. చిరంజీవి ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నారు. సినిమా హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా వరుస అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్నారు. కాగా మెగాస్టార్ చిరంజీవి చివరగా భోళా శంకర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. అలాగే ఈ ఏడాది ఆరంభంలో వాల్తేరు వీరయ్య సినిమాతో ప్రేక్షకులను పలకరించారు చిరంజీవి.

భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా హిట్ టాక్ నీ తెచ్చుకుంది. ఈ మూవీ ఇటీవల బుల్లితెర పైకి కూడా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం ఇప్పుడు తమిళ్ వెర్షన్ లో కూడా వరల్డ్ ప్రీమియర్ గా టెలికాస్ట్ అయ్యేందుకు సిద్ధం కాగా రేపు అక్టోబర్ 29న మధ్యాహ్నం 3 గంటలకి అయితే ఈ సినిమా విజయ్ టెలివిజన్ ఛానెల్లో ప్రసారం కానుంది. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ ప్రశ్న ఏమిటంటే.. తమిళ బుల్లితెరపై మెగాస్టార్ గత పాన్ ఇండియా చిత్రం సైరా నరసింహా రెడ్డి సినిమాకి భారీ రికార్డు ఉంది.

ఆ చిత్రానికి 15.44 టీఆర్పీ రేటింగ్ నమోదు కాగా టాలీవుడ్ చిత్రాల్లో అయితే ఇదొక భారీ రికార్డుగా ఉంది. మరి ఇప్పుడు వాళ్తేరు వీరయ్య దీనిని బ్రేక్ చేస్తాడో లేదో అనేది చూడాలి మరి. బాబీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్గా నటించిన విషయం తెలిసిందే. మరి తమిళంలో ఈ సినిమా ఎలాంటి అంచనాలను క్రియేట్ చేస్తుందో చూడాలి మరి.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -