Megastar Chiranjeevi: కూటమికి పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న చిరంజీవి.. జగన్ కు ఇంతకంటే షాక్ కావాలా?

Megastar Chiranjeevi:  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల పై తీవ్రస్థాయిలో ఉత్కంఠత నెలకొంది. వైసీపీ పార్టీ సింగిల్ గా పోటీ చేయగా జనసేన, టీడీపీ, భాజాపా కూటమిగా ఏర్పడి ఎన్నికల బరిలోకి రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే సినీ నటుడు చిరంజీవి కూటమికి మద్దతు తెలియజేస్తూ కూటమిని గెలిపించాలని కోరారు. ఇలా కూటమి ఎన్నికల బరిలోకి రాబోతున్నటువంటి తరుణంలో చిరంజీవి స్పందిస్తూ ఇది చాలా మంచి పరిణామం..చాలా సంతోషం.. చాలా రోజుల తర్వాత ఇలా రాజకీయాల గురించి మాట్లాడుతున్నానని తెలిపారు.

చాలా రోజుల తర్వాత ఇలా రాజకీయాల గురించి మాట్లాడటానికి కారణం తమ్ముడు పవన్ కళ్యాణ్ అని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గతంలో ముందుకు వెళ్లాలన్నది నా కోరిక అని తెలిపారు. అది జరగాలి అంటే మీరంతా నడుం బిగించి ఇలాంటి వారికి ఓటు వేయాలంటూ సీఎం రమేష్, పంచకర్ల రమేష్ కి ఓటు వేసి గెలిపించాలని ఈయన కోరారు.

వీరిద్దరూ హైదరాబాద్లో చిరంజీవిని కలిశారు అక్కడ ఆయన వీరితో మాట్లాడుతూ వీరికి ఓటు వేయాలని తెలుపుతూ ఒక వీడియోని విడుదల చేశారు. సీఎం రమేష్ నా చిరకాల మిత్రుడు పంచకర్ల రమేష్ నా ఆశీస్సులతో రాజకీయ ప్రవేశం చేశారని తెలిపారు. వీరిద్దరూ నాకు కావాల్సినవారు ఇద్దరు మంచివాళ్లే ఎంతో సమర్థులు. వారిని గెలిపించండి నియోజకవర్గం అభివృద్ధికి వీరు దోహదపడతారనే నమ్మకం నాకు ఉంది అంటూ ఈ సందర్భంగా చిరంజీవి కూటమికి సపోర్ట్ చేస్తూ చేసినటువంటి ఈ వీడియో వైరల్ గా మారింది.

ఈ విధంగా కూటమికి మెగాస్టార్ చిరంజీవి మద్దతు తెలియజేస్తున్నటువంటి తరుణంలో కూటమి విజయం పక్క అని స్పష్టమవుతుంది. ఇలా కూటమికి రోజురోజుకు బలం చేకూరడంతో ఇది జగన్మోహన్ రెడ్డికి ఊహించని షాక్ అని చెప్పాలి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూటమికే భారీ స్థాయిలో మద్దతు లభిస్తున్న సంఘటనకు తెలిసిందే .ఈ ఎన్నికల తప్పనిసరిగా కూటమి అధికారంలోకి రాబోతుంది.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -