Godfather: ఆ ఒక్క తప్పే గాడ్ ఫాదర్ మూవీకి శాపంగా మారిందా.. ఎందుకు చేశారంటూ?

Godfather: మలయాళంలో ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకున్న లూసిఫర్ సినిమాకి రీమేక్ చిత్రంగా గాడ్ ఫాదర్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు డైరెక్టర్ మోహన్ రాజా. లూసిఫర్ సినిమాలో కొన్ని మార్పులను చేస్తూ ఈ కథను ఎంతో అద్భుతంగా మలిచారు. ఇకపోతే ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ విజయదశమి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఇకపోతే ఈ సినిమాలో ప్రతి ఒక్కరి పాత్రను దర్శకుడు మోహన్ రాజ ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దారు. అయితే ఒరిజినల్ లూసిఫర్ సినిమాలో మోహన్ లాల్ పాత్రను తీర్చిదిద్దిన విధంగా చిరంజీవి పాత్రను ఆయన లుక్ తీర్చిదిద్దలేకపోయారని తెలుస్తోంది. ఇక మలయాళంలో పృథ్వీరాజ్ సుకుమార్ పాత్రను తెలుగులో సల్మాన్ ఖాన్ చేశారు.

ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ రెండు మూడు సన్నివేశాలలో కనిపిస్తారు. కానీ సల్మాన్ ఖాన్ పాత్రను డైరెక్టర్ చాలా సిల్లిగా చూపించారని తెలుస్తోంది. సల్మాన్ ఖాన్ పాత్ర ఈ సినిమాకి కాస్త మైనస్ గా నిలిచిందని అభిమానులు వారి అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. సల్మాన్ ఖాన్ పాత్ర తెరపై కనిపించినప్పుడు అలాగే కొన్ని ఫైట్ సన్ని వేశాలలో సల్మాన్ ఖాన్ చేస్తున్నప్పుడు ప్రేక్షకులలో ఏ విధమైనటువంటి ఉత్సాహం కనిపించలేదని తెలుస్తోంది.

ఇక సల్మాన్ ఖాన్ నటించిన సన్నివేశాలలో ఉపయోగించిన గ్రాఫిక్స్ కూడా పెద్దగా ఎఫెక్టివ్ గా లేవని నాసిరకం గ్రాఫిక్స్ ఉపయోగించారు. ఇక ఈయన నటించిన సన్నివేశాలన్నీ ప్రేక్షకులు ఊహకు అందే విధంగా చిత్రీకరించారని చెప్పాలి. ఏది ఏమైనా సల్మాన్ ఖాన్ పాత్ర గాడ్ ఫాదర్ మూవీకి కాస్త మైనస్ గాని నిలిచింది ఇంతకుమించి సినిమా మొత్తం అద్భుతంగా ఉందని చెప్పాలి.

Related Articles

ట్రేండింగ్

Budi Mutyala Naidu: వైసీపీ ఎంపీ అభ్యర్థికి “సన్” స్ట్రోక్.. తండ్రి ఓటమి కోసం కొడుకు ప్రచారం చేస్తున్నారా?

Budi Mutyala Naidu:  రాష్ట్ర ఎన్నికలలో ఆసక్తికర ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. రాజకీయాల ముందు కుటుంబ బంధాలు ఓడిపోతున్నాయి. ఇంతకుముందు టెక్కలి లో ఇలాంటి ఘటన ఒకటి చూసాము, ఇప్పుడు అనకాపల్లి పార్లమెంటు...
- Advertisement -
- Advertisement -