Godfather: భారీగా డ్రాపైన గాడ్ ఫాదర్ వసూళ్లు.. రూ.60 కోట్లు కూడా కష్టమేనా?

Godfather: మోహన్ రాజ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి మలయాళ సూపర్ హిట్ సినిమా లూసిఫర్ సినిమాకి రీమేక్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం గాడ్ ఫాదర్. ఈ సినిమా విజయదశమి సందర్భంగా విడుదలవడంతో పెద్ద ఎత్తున ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. పండుగను క్యాష్ చేసుకున్నటువంటి ఈ సినిమా దసరా సెలవులు నేపథ్యంలో వారం రోజుల పాటు భారీగానే కలెక్షన్లను రాబట్టింది..

ఆదివారం వరకు దసరా సెలవులు ఉన్న నేపథ్యంలో థియేటర్ల వద్ద పండుగ వాతావరణం నెలకొంది.అయితే ఆదివారంతో వీకెండ్ సెలవులు కూడా ముగియడంతో సోమవారం వర్కింగ్ డే కారణంగా ఒక్కసారిగా ఈ సినిమా కలెక్షన్లు సగానికి సగం పడిపోయాయని తెలుస్తోంది. వర్కింగ్ డే ఎఫెక్ట్ గాడ్ ఫాదర్ సినిమాపై భారీగానే పడింది.కొన్ని ఏరియాలలో సోమవారం కలెక్షన్లు పరవాలేదు అనిపించినప్పటికీ మరికొన్ని ఏరియాలో సగానికి సగం పడిపోయాయని ట్రేడ్ వర్గాల నిపుణులు చెబుతున్నారు.

ఇలా సోమవారం వర్కింగ్ డే కావడంతో గాడ్ ఫాదర్ కలెక్షన్లపై ప్రభావం ఏర్పడింది అయితే ఇది ఇలాగే కొనసాగుతుందా లేదంటే మరి ఈ కలెక్షన్లు పుంజుకునే అవకాశం ఉందా అనే విషయం తెలియాల్సి ఉంది. అయితే దీపావళి పండుగ వరకు ఏ ఇతర సినిమాలు విడుదల కానీ నేపథ్యంలో మరో పది రోజులపాటు థియేటర్లలో మెగా సందడి కొనసాగుతుందని అర్థమవుతుంది.

ఇలా ఈ రెండు వారాల పాటు కొంతమేర కలెక్షన్లను పొంచుకొని ఈ సినిమా భారీ లాభాలను పొందుతుందా లేకపోతే ఈ సినిమా ఇలాంటి కలెక్షన్లను సంపాదించుకొని ఇంతటితోనే సరిపెట్టుకుంటుందా అనే విషయం తెలియాల్సి ఉంది. ఇకపోతే ఈ సినిమాలో హీరోయిన్ నయనతార నటించినప్పటికీ మెగాస్టార్ చిరంజీవికి చెల్లెలు పాత్ర ద్వారా ఈమె నటించారు అలాగే బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్, సత్యదేవ్ వంటి స్టార్ సెలబ్రెటీలు ఈ సినిమా ద్వారా ప్రేక్షకులను సందడి చేశారు.

Related Articles

ట్రేండింగ్

YSRCP: తొలి విడత డబ్బు పంపిణీ దిశగా వైసీపీ అడుగులు.. కోట్లు చేతులు మారుతున్నాయా?

YSRCP: సాధారణంగా ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో భాగంగా ప్రచార కార్యక్రమాలకు వచ్చే కార్యకర్తలకు మందు, భోజనంతో పాటు రోజువారీ కూలీ కూడా డబ్బులను కూడా అందజేస్తూ ఉన్నారు అయితే ఇప్పటికే కూటమి చేతిలో...
- Advertisement -
- Advertisement -