Niharika Konidela: భర్తను దూరం పెట్టిన మెగా డాటర్.. అందుకే ఒంటరిగా ఉందా?

Niharika Konidela:  టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా కుటుంబానికి ఎలాంటి క్రేజ్ ఉందో మనకు తెలిసిందే.ఇలా మెగా కాంపౌండ్ నుంచి ఎంతో మంది హీరోలు ఇండస్ట్రీకి పరిచయమైనప్పటికీ హీరోయిన్ గా నిహారిక మాత్రమే ఎంట్రీ ఇచ్చారు. ఇలా మెగా కాంపౌండ్ నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన వన్ అండ్ ఓన్లీ హీరోయిన్ గా నిహారిక పేరు సంపాదించుకుంది.ఇలా నిహారిక యాంకర్ గా తన కెరియర్ ప్రారంభించి అనంతరం హీరోయిన్ గా పలు సినిమాలలో నటించారు.

ఈ విధంగా పలు సినిమాలలో నటించినప్పటికీ ఈమెకు పెద్దగా గుర్తింపు రాకపోవడంతో ఈమె నిర్మాతగా స్థిరపడ్డారు. జొన్నలగడ్డ వెంకట చైతన్యను వివాహం చేసుకున్న అనంతరం నిహారిక సినిమాలకు దూరమై వెబ్ సిరీస్ ను నిర్మిస్తూ నిర్మాతగా స్థిరపడ్డారు.ఇక మెగా ఫ్యామిలీలో నిహారికకు ఎంతో ఫ్రీడమ్ ఉన్న విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే వివాహమైన తర్వాత కూడా ఈమెకు అలాంటి స్వేచ్ఛ ఉందని తెలుస్తోంది.

ఈ విధంగా నిహారికకు అత్తారింట్లో కూడా స్వేచ్ఛ ఉండడంతో ఈమె పలుమార్లు విమర్శలను కూడా ఎదుర్కొన్న సందర్భాలు ఏర్పడ్డాయి. తన భర్త వెంకట చైతన్యతో కలిసి రొమాంటిక్ ఫోటోలకు ఫోజులిస్తూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈ ఫోటోలపై ఎంతో మంది తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అదేవిధంగా రాడిసన్ పబ్ వ్యవహారంతో నీహారిక తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. ఇకపోతే ఈ మధ్యకాలంలో నిహారిక తన స్నేహితులతో కలిసి హాలిడే వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు.

ఈ మధ్యకాలంలో నిహారిక ఒంటరిగా తన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు. ఎక్కడ కూడా తన భర్తతో దిగిన ఫోటోలను షేర్ చేయడం లేదు అలాగే దీపావళి పండుగ సందర్భంగా అల్లు అర్జున్ ఇంట సెలబ్రేషన్స్ లో కూడా నిహారిక మాత్రమే పాల్గొన్నారు.ఈ క్రమంలోనే ఎంతో మంది నెటిజన్లు నిహారిక ఫోటోలు చూసిన అనంతరం పలు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. నిహారిక కూడా తన భర్త చైతన్యను దూరం పెట్టిందా అందుకే ఇలా ఒంటరిగా కనిపిస్తోంది అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు. అదేవిధంగా మరికొందరు మెగా ఫ్యామిలీలో ఏం జరుగుతోంది అంటూ పెద్ద ఎత్తున సందేహాలను వ్యక్తపరుస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -