Nagarjuna-Tabu: టబుతో అఫైర్ గురించి నాగ్ ఏమన్నారో మీకు తెలుసా?

Nagarjuna-Tabu: సినీ ఇండస్ట్రీలో హీరో హీరోయిన్ల మధ్య ఎఫైర్స్ కామన్. సినిమాల్లో రొమాంటిక్ సీన్లు నటించేటప్పుడు చాలా మంది హీరో హీరోయిన్లు నిజంగానే ప్రేమలో పడిపోతుంటారు. కొద్ది రోజులపాటు చెట్టాపట్టాలేసుకొని తిరుగుతారు. కొద్ది రోజులపాటు వారి జోడినే వార్తల్లోనే నిలుస్తుంటుంది. అయితే ఎంత స్పీడ్‌గా వీళ్లు కనెక్ట్ అవుతారో? అంతే తొందరగా విడిపోతుంటారు. అయితే చాలా రేర్ కేసులు మాత్రమే పెళ్లి పీటలెక్కుతారు. టాలీవుడ్ మన్మథుడు నాగార్జున మొదటి భార్యతో విడాకులు తీసుకుని హీరోయిన్ అమల ప్రేమలో పడిన విషయం తెలిసిందే.

మొదటి భార్యకు విడాకులు ఇప్పించి.. అమలను పెళ్లి చేసుకున్నారు. ఇంట్లో ఒప్పించి అమలను వివాహం చేసుకున్నారు. చాలా కాలంగా నాగార్జునపై ఓ పుకారు ఉంది. హీరోయిన్ టబుతో ఎపైర్ నడిపిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ‘నిన్నే పెళ్లాడుతా’ సినిమాలో నాగార్జున-టబు నటించారు. ఆ తర్వాత ‘ఆవిడా మా ఆవిడే’ సినిమాలో నటించారు. అయితే నటించింది రెండు సినిమాలైన వీరిద్దరిపై పుకార్లు ఓ రేంజ్‌లో బయటికి వచ్చాయి. ప్రస్తుతం టబుకు 50 ఏళ్ల వచ్చాయి. కానీ ఇప్పటివరకు వివాహం చేసుకోలేదు.

అయితే దీనికి ప్రధాన కారణం లవ్ ఎఫైర్ అనే వాదన వినిపిస్తోంది. ముఖ్యంగా నాగార్జున కారణంగానే టబు సింగిల్‌గానే ఉండిపోయినట్లు సమాచారం. అయితే టబు హైదరాబాద్‌కి వచ్చిన ప్రతిసారి నాగార్జునను కలిసి వెళ్తారనే టాక్ వినిపిస్తోంది. దీంతో నాగార్జన-టబు మధ్య ఎఫైర్ నడుస్తోందని టాక్ వినిపిస్తోంది. ఈ విషయంపై అందరూ పుకార్లు లేవనెత్తడంతో.. తొలిసారిగా హీరో నాగార్జున ఈ విషయంపై స్పందించారు. టబుకు తనకు మధ్య ఉన్న రిలేషన్‌షిప్‌పై క్లారిటీ ఇచ్చారు. రెండు దశాబ్దాలకుపైగా టబుతో తనకున్న అనుబంధాన్ని చెప్పుకొచ్చారు. టబు తను మంచి స్నేహితులని తెలిపారు. తన భార్య అమలకు కూడా మంచి స్నేహం ఉందన్నారు. ఇంటికి వచ్చిన ప్రతిసారి కలిసి మాట్లాడుకుంటారని, ఇదంతా పుకార్లేనని స్పష్టం చేశారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -