Worship: రోజుకో దేవుడిని ఈ పద్ధతిలో పూజించండి.. అన్ని శుభాలే!

Worship: ఏ కులమైనా ప్రతి ఒక్కరూ వారి వారి దేవుళ్లకు ప్రత్యేక పూజలు, ప్రార్థనలు చేస్తుంటారు. హిందూ సాంప్రదాయం ప్రకారం కొన్ని కొన్ని కుటుంబాలు ఒక రోజున తమ ఇంటి దేవుళ్లను పూజిస్తుంటారు. వారంలో ఒక్కో రోజు ఒక్కో దేవుడిని పూజిస్తే అన్ని శుభాలే జరుగుతాయని భావిస్తుంటారు.

సోమవారం చంద్రుడికి సంబంధించిన రోజు కాబట్టి ఈ రోజు శివుడిని పూజిస్తుంటారు. సోమవారం శివుడికి అతి ఇష్టమైన రోజు కాబట్టి మారేడు పువ్వులు, లేదా బిల్ల దశాలలతో శివుడికి పూజ చేస్తే చేపట్టిన పనులన్నీ సఫలమవుతాయని నమ్ముతారు.

మంగళవారం దుర్గామాతతో పటు ఆంజనేయుడికి పూజలు చేస్తారు. ఈ రోజు వీరిద్దరి పూజిస్తే అన్ని శుభ ఫలితాలు వస్తాయట. ఎలాంటి అనారోగ్య సమస్యలున్నా ఆంజనేయుడికి తమలపాకుల మాల, వడ మాల వేసి అర్చన చేస్తే ఆ రోగాల నయమవుతాయి నమ్ముతారు. అనారోగ్య పరిస్థితి తీవ్రతరం ఉంటే దుర్గామాతను పూజిస్తారు.

బుధవారం నాడు మహా గణపతిని పూజిస్తారు. ఈ రోజు ఎర్ర మందారాలతో గణపతిని పూజిస్తే అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి.

గురువారం సాయిబాబాతో పాటు గురుగ్రహానికి పూజలు చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. పాలు, పాలతో తయారుచేసిన పదార్థాలతో సాయిబాబాను పూజించడం వల్ల సత్ఫలితాలు కలుగుతాయి.

శుక్రవారం మహాలక్ష్మికి ఎంతో ప్రీతికరమైన రోజు కాబట్టి తులసి పూజ, గోపూజ చేసినా కూడా శుభ ఫలితం కలుగుతుంది అలాగే అష్టైశ్వర్యాలు కూడా పొందవచ్చు.

శనివారం వెంకటేశ్వర స్వామి కి ఎంతో ఇష్టమైన రోజు ఈ రోజు. శనీశ్వరుడు, ఆంజనేయస్వామికి కూడా పూజలు నిర్వహించడం వల్ల ఎటువంటి ఇబ్బందులు దరిచేరవు.

ఆదివారం సూర్యుడిని పూజిస్తే జ్ఞాపక శక్తి పెరగడంతో పాటు ఆరోగ్యంగా కూడా జీవిస్తాం. ఆదివారం రోజు ఉదయాన్నే సూర్య భగవానుడికి ధాన్యాన్ని సమర్పిస్తే మంచి ఫలితాలు వస్తాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -