Vinayaka Chavithi: వినాయకచవితి రోజున వినాయకుడిని ఎప్పుడు పూజించాలో తెలుసా.. చేయకూడని తప్పులివే!

Vinayaka Chavithi: హిందువులు ఘనంగా జరుపుకునే పండుగలలో వినాయక చవితి కూడా ఒకటి. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు ఈ పండుగను అత్యంత ఘనంగా వైభవంగా చేసుకుంటూ ఉంటారు. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు ఈ వినాయక చవితి పండుగ సెలబ్రేషన్స్ లో పాల్గొంటూ ఉంటారు. ఆ విగ్నేశ్వరున్ని చూడగానే ప్రతి ఒక్కరు చిన్న పిల్లల మారిపోతూ ఉంటారు. మూడు రోజుల నుండి దాదాపు 11 రోజుల వరకు ఈ పండుగని జరుపుకుంటూ ఉంటారు. వినాయకుడు భాద్రపద మాసంలోని శుక్లపక్ష చతుర్థి రోజున పుట్టాడు.

ఈ సంవత్సరం వినాయక చవితి ఎప్పుడు వచ్చిందా అని చాలామంది పదే పదే పండితుల్ని అడగడం, పంచాంగాలని తిరగేయడం చేస్తున్నారు. మరి ఆ వివరాల్లోకి వెళితే.. ఈ ఏడాది వినాయక చవితి పండుగ 2023 సెప్టెంబర్ 18వ తేదీతో పాటు 19న కూడా తిథి వుంది. వినాయక చవితిని కొందరు 18న జరుపుతుండగా, కొందరు 19న జరుపుకుంటున్నారు. సెప్టెంబర్ 28న నిమజ్జనం చేస్తారు. పంచాంగం ప్రకారం తిథి సెప్టెంబర్ 18వ తేదీ మధ్యాహ్నం 12:39 గంటలకి మొదలయ్యి మరుసటి రోజు అనగా సెప్టెంబర్ 19వ తేదీ రాత్రి 8:43 గంటలకి ముగుస్తుంది. కాబట్టి సెప్టెంబర్ 19న వినాయక చవితి జరుపుకోవాలని అంటున్నారు.

కానీ కాణిపాకంలో, భాగ్యనగరంలో సెప్టెంబర్ 18న చేస్తున్నారు. నవరాత్రుల‌లో కూడా వినాయకుడిని పూజిస్తూ ఉంటారు. 11వ రోజు నియమాల ప్రకారం భక్తిశ్రద్ధలతో వినాయకుడిని నిమజ్జ‌నం చేస్తారు. వినాయక చవితి నాడు వినాయకుడికి ఇష్టమైన గరికను కచ్చితంగా పెట్టాలి. అలాగే నైవేద్యంగా కుడుములు, ఉండ్రాళ్ళు చెరుకుతోపాటు పండ్లని కూడా నైవేద్యం పెట్టాలి. చాలామంది వినాయక చవితి నాడు పాలవెల్లి కడుతూ ఉంటారు. పాలవెల్లకి రకరకాల పండ్లు కట్టాలి. మొక్కజొన్న పొత్తులు, మారేడు కాయ, వెలగ వంటివి కూడా పెడుతూ ఉంటారు. వినాయక చవితి నాడు వినాయకుడికి ఇష్టమైన ఎర్రమందారాలు, ఎర్రటి పూలతో పూజ చేస్తే మంచిది.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -