Lord Ganesh: విష్ణుమూర్తిలాగే వినాయ‌కుడు కూడా అవ‌తారాలు ఎత్తారా.. గణేషుని గురించి ఈ షాకింగ్ విషయాలు తెలుసా?

Lord Ganesh: పురాణాలలో ఎక్కువసార్లు అవతారాలు ఎత్తిన వ్యక్తిగా విష్ణుమూర్తి గురించి అందరికీ తెలిసిందే కానీ వినాయకుడు కూడా రాక్షస సంహారార్థం ఎనిమిది అవతారాలు ఎత్తాడని చాలామందికి తెలియదు. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం. ముద్గల పురాణం ప్రకారం వినాయకుడు ఎనిమిది అవతారాలు ఎత్తాడు. అవి వక్రతుండుడు, ఏకదంతుడు, మహోదరుడు, గజాననుడు, లంబోదరుడు, వికతుడు, విఘ్న రాజు, ధూమ్రవర్ణుడు.

వీటిని ఎప్పుడు ఏ సందర్భాలలో ధరించాడో చూద్దాం. దేవతలందరూ గమ్ అనే బీజాక్షరంతో గణపతి గురించి తపస్సు చేయగా పుట్టినవాడు వక్రతుండడు. ఈయన సింహవాహనుడై మాత్సర్యాసురుడనే రాక్షసుడిని జయించాడు. ఇక ఏకదంతుడు మదాసురుడు అనే రాక్షసుడిని జయించడానికి ఎత్తిన అవతారం. ఇక మోహాసురుడు అనే రాక్షసుడిని జయించడం కోసం మహోదరుడు అవతారం ఎత్తాడు గణపయ్య. ఇక లాభాసురుడు అనే రాక్షసుడిని జయించడం కోసం గజాననుడి అవతారం ఎత్తాడు.

ఇక క్రోధాసురుడు అనే రాక్షసుడిని సంహరించడం కోసం లంబోదరుడు అనే పేరుతో అవతరించాడు. అలాగే కామసూరుడు అనే రాక్షసుడిని సంహరించడం కోసం వికటుడు అనే పేరుతో అవతరించాడు గణేషుడు. ఈ ఆకారం ఒక్కొక్కసారి ఓంకారాన్ని కూడా తలపిస్తుంది. అన్ని రూపులలోకి ఈ రూపు కాస్త భిన్నంగా ఉంటుంది. ఇక తర్వాత అవతారం విఘ్నరాజ అవతారం. ఇప్పటి వరకు కామ, క్రోధ, మోహ, లోభ, మదమాత్సర్యాలనే అరిషడ్వర్గాలకు ప్రతీకగా రాక్షసులని చూసాము ఇక మమతాసురుడు అనే రాక్షసుడిని సంహరించడానికి పుట్టిన అవతారం. మమత అంటే ఇక్కడ దేహాభిమానము ఈ అవతారంలో గణేషుడు నాగుపాముని వివాహనంగా చేసుకున్నట్లు చెబుతారు.

ఇక ఎనిమిదవది ధూమ్రవర్ణుడు. అరిషడ్వర్గాలు అయిపోయాయి, దేహాభిమానము తీరిపోయింది. ఇక నేను అనే అహంకారం ఒక్కటే మిగిలింది. దానికి సూచనే అహంకారాసురుడు అనే రాక్షసుడు. ధూమ్రము అంటే పొగ అన్న అర్థం కూడా వస్తుంది. పొగకి ఎలా అయితే ఆకారము పరిమితి ఉండదో అలాగే మనిషి కూడా మనిషి తాను అనే అహంకారాన్ని వీడి భగవంతునిలో ఐక్యం కావడానికి సూచన ఈ అహంకారసురుని వృత్తాంతం. విష్ణుమూర్తి అవతారాలు మానవుని శరీరం ఎక్కడి నుంచి మొదలైంది అని వివరిస్తే వినాయకుని అవతారాలు అరిషడ్వర్గాలని ఎలా అరికట్టాలో వివరిస్తుంది.

Related Articles

ట్రేండింగ్

The Land Titling Act: ఏపీ ఓటర్లకు అలర్ట్.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి తెలుసుకుని ఓటేస్తే బెటర్!

The Land Titling Act: ఆంధ్రప్రదేశ్ లో లోక్‌సభతో పాటు అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి. ఢిల్లీలో ఎవరు ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రజల బతుకుల్ని ప్రభావితం చేస్తుంది. గతంలో ఏ ప్రభుత్వము...
- Advertisement -
- Advertisement -