Srikanth: భార్యకు విడాకులు ఇవ్వనున్న శ్రీకాంత్.. ఏమైందంటే?

Srikanth: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నా డీసెంట్, ఫ్యామిలీ హీరోలు మాత్రం చాలా తక్కువ. ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం ఇలాంటి హీరోలు మాత్రం ఎవరూ లేరని చెప్పుకోవాలి. తెలుగులో ఇలాంటి మంచి పేరున్న హీరో శ్రీకాంత్. విలన్ గా ఎంట్రీ ఇచ్చిన శ్రీకాంత్.. తెలుగులో మంచి మంచి సినిమాలు చేసి ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గరయ్యాడు.

 

 

ఒకప్పుడు మహిళా అభిమానులు ఎక్కువగా ఉన్న హీరోగా, ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ కలిగిన హీరోగా శ్రీకాంత్ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఫ్యామిలీ కథలు చేసి లేడీ ఫాలోయింగ్ ను విపరీతంగా పెంచుకున్న శ్రీకాంత్.. హీరోయిన్ ఊహను ప్రేమ పెళ్లి చేసుకోవడం తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్ స్క్రీన్ మీద హిట్ కాగా.. రియల్ లైఫ్ కూడా వీరిద్దరు ఒక్కటై ఎంతో సంతోషకరమైన ఫ్యామిలీని రన్ చేస్తున్నాడు.

 

హీరో శ్రీకాంత్, ఊహలు ముగ్గురు పిల్లలను కలిగి ఉన్నారు. మొదటి అబ్బాయి రోహన్ ఇప్పటికే సినిమాలు చేస్తుండగా.. అమ్మాయి, చిన్నబ్బాయి ఇంకా చదువుకుంటున్నారు. అయితే తాజాగా శ్రీకాంత్, ఊహలకు సంబంధించిన ఓ వార్త అందరిలో చర్చకు దారితీసింది. శ్రీకాంత్, ఊహలు త్వరలో విడాకులు తీసుకోబోతున్నాకనే వార్త ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

 

శ్రీకాంత్, ఊహల ఫ్యామిలీ ఈ మధ్యన ఆర్థిక పరమైన ఇబ్బందులను ఎదుర్కొంటోందని తెలుస్తోంది. దీంతో ఇద్దరి మధ్యన గొడవలు వస్తున్నాయని.. బయటకు మామూలుగా ఉన్నట్లు కవర్ చేస్తున్నా కూడా ఇంట్లో మాత్రం ఇద్దరి మధ్య కోల్డ్ వార్ జరుగుతోందట. ఈ విషయం ఎలాగోలా ఓ పెద్దాయనకు తెలిసి.. శ్రీకాంత్ ను పిలిచి ఫ్యామిలీని బాగా చూసుకోవాలని కొన్ని సూచనలు చేశారట. మొత్తానికి శ్రీకాంత్, ఊహల మధ్య గొడవలు జరగడం, వారు విడిపోతారనే వార్త ఇండస్ట్రీలోని వారితో పాటు తెలుగు ప్రేక్షకులకు కూడా బాధ కలిగిస్తోంది.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -