Folk-Mangli: మంగ్లీ చేసిన పనిని మించిన దరిద్రం ఉండదుగా..!!

Folk-Mangli: సింగర్ మంగ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఫోక్ సింగర్‌గా పేరు సంపాదించుకున్న మంగ్లీ తనదైన స్టైలులో సినిమాల్లో క్లాస్ మాస్ బీట్స్ పాడుతూ కుర్రాళ్ల గుండెల్లో వేడి పుట్టించింది. ఇటీవల ఎక్కువగా ఆమె ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తోంది. తెలంగాణలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా జరుపుకునే బతుకమ్మ, సమ్మక్క సారలమ్మ జాతర, బోనాల ఉత్సవాలపై మంగ్లీ చేసిన మ్యూజిక్ ఆల్బమ్స్ ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి.

 

ఈ నేపథ్యంలో సింగర్ మంగ్లీకి అరుదైన గౌరవం దక్కింది. టీటీడీకి సంబంధించిన శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్ అడ్వైజర్‌గా ఆమె అపాయింట్ అయ్యారు. రెండు సంవత్సరాల పాటు ఈ పదవిలో కొనసాగుతారు. ఈ మేరకు ఎస్వీబీసీ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇప్పటికే ఆమె బాధ్యతలను కూడా స్వీకరించారు. నిజానికి ఈ పదవికి సంబంధించిన ప్రాసెస్ ఎప్పుడో పూర్తయింది. మార్చి నెలలోనే టీటీడీ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పదవి నిమిత్తం మంగ్లీ నెలకు రూ.లక్ష వేతనాన్ని అందుకోనున్నట్లు తెలుస్తోంది.

 

అయితే సింగర్ మంగ్లీకి టీటీడీలో ఈ పదవి రావడం వల్ల ఆమె ఎన్నో త్యాగాలు చేసిందని ప్రచారం జరుగుతోంది. ఆమెకు ఇష్టమైన ఫోక్ పాటలను వదులుకుందని కొందరు ఆరోపిస్తుంటే.. తన గొంతును మంగ్లీ అమ్మేసుకునిందని ..ఇకపై ఆమెకు ఫోక్ పాటలను పాడే ఛాన్స్ ఇవ్వరని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. పొలిటికల్ పరంగా ముందుకు తీసుకెళ్లడానికి ఆమెను ఓ రాజకీయ పార్టీ బాగా వాడుకుంటోందని విమర్శలు చేస్తున్నారు.

 

సింగర్ మంగ్లీ నేపథ్యం ఏంటి?
మంగ్లీ అసలు పేరు సత్యవతి రాథోడ్. తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం నుంచి కర్ణాటక మ్యూజిక్‌లో డిప్లొమా పూర్తి చేసింది. అనంతరం యాంకర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించింది. అయితే మ్యూజిక్‌పై ఆసక్తి ఉండటంతో సింగర్‌గా మారింది. లవ్‌స్టోరీ సినిమాలో కుడిభుజం మీద కడవ అనే పాట ఎంతో సూపర్ హిట్ అయ్యింది. జానపద గాయనిగా గుర్తింపు తెచ్చుకున్న మంగ్లీ తొలుత ప్రైవేట్ ఆల్బమ్స్‌ చేసింది. ఇవన్నీ ఆమెకు మంచి పేరును తీసుకొచ్చాయి. తెలంగాణలో పండగ సమయాలలో మంగ్లీ పాడిన పాటలు అన్ని చోట్ల వినిపిస్తుంటాయి.

Related Articles

ట్రేండింగ్

Election Campaigns: ఎన్నికల వేళ గరిష్టంగా రోజుకు 5,000 రూపాయలు.. కూలీలకు పంట పండుతోందా?

Election Campaigns: ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల ప్రచారం చూస్తుంటే ఇవి అత్యంత ఖరీదైనవి గా కనిపిస్తున్నాయి. ఎందుకంటే గతంలో ఎన్నికల సమయంలో పార్టీ నాయకుల మీద అభిమానంతో స్వచ్ఛందంగా జనాలు...
- Advertisement -
- Advertisement -