Karimnagar: కుటుంబ పెద్ద మరణం తర్వాత స్మశానంలోనే భార్య, కూతుళ్లు

Karimnagar: మనుషులు మనం సమాజంలో మనగలుగుతున్నామంటే దానికి కారణం మనలోని మానవత్వమే. అయితే మనలో చాలామంది అప్పుడప్పుడు మానవత్వాన్ని మర్చి మృగాల మాదిరిగా ప్రవర్తిస్తుంటారు. మానవత్వం మరిచిన ఇలాంటి మనుషుల వల్ల సమాజం మీద విసుగుపుడుతుంటుంది. ఓ ఇంటి యజమాని వల్ల ఓ కుటుంబం ఎలాంటి దీనస్థితిలో ఉండిపోయిందో కింద చదవండి.

కరీంనగర్ కు చెందిన బస్వరాజు కనకయ్య అనే వ్యక్తికి చాలాకాలంగా అనారోగ్యం ఉంది. అతడి రెండు కిడ్నీలు పాడైపోగా అతడికి వైద్యం చేయించే స్థితిలో అతడి కుటుంబం లేదు. అతడికి భార్య, ఇద్దరు ఆడ పిల్లలు ఉండగా, ఒక ఆడ బిడ్డ దివ్యాంగురాలు. బస్వరాజు కనకయ్యకు వైద్యం అందించినా బ్రతకడని, ఇంటికి తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు.

అయితే కనకయ్య ఉంటున్న ఇంటి ఓనర్ మాత్రం ఇంట్లోకి అతడిని తీసుకురావడానికి వీలు లేదని హెచ్చరించాడు. దాంతో ఆ భార్య, తన ఇద్దరు కూతుళ్లను, భర్తను తీసుకొని స్మశానానికి వెళ్లింది. కొన ఊపిరితో ఉన్న బస్వరాజు కనకయ్య స్మశానంలో కాలిన శవాలను చూస్తూ, తన దీనస్థితిని తలుచుకొని కన్ను మూశాడు.

బస్వరాజు కనకయ్య మరణం తర్వాత మైల ఉంటుందని, కాబట్టి ఇప్పుడే ఇంట్లోకి రావడానికి వీలులేదని ఆ ఓనర్ మరోసారి హెచ్చరించాడు. దీంతో ఏం చేయాలో తెలియని స్థితిలో తల్లి, కూతుళ్లు స్మశానంలోనే ఉంటున్నారు. వచ్చీ పోయే శవాలను చూస్తూ.. బ్రతికున్నా తాము శవాలుగా మారామని శోకంలో మునిగిన ఘటన అందరినీ కలచి వేస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ బ్యాలెట్ నంబర్ ఖరారు.. ఓటర్లు సులువుగానే ఓటు వేయొచ్చుగా!

Pawan Kalyan:  జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం బరిలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పేరు బ్యాలెట్ ఆర్డర్లో ఎక్కడ ఉందో జనసేన పార్టీ ఒక...
- Advertisement -
- Advertisement -