Mahesh Babu: రెమ్యునరేషన్ విషయంలో మహేష్ బాబు సంచలన నిర్ణయమిదే!

Mahesh Babu: సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు తాజాగా త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ డైరెక్షన్‌లో మూవీ చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు తర్వాత దర్శక ధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి దర్శకత్వంలో మహేష్‌బాబు నటించనున్న విషయం తెలిసిందే. ఇటీవల ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీతో బంపర్‌ హిట్‌ కొట్టారు రాజమౌళి. రామ్‌చరణ్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌ ఈ చిత్రంలో తమ నటనా కౌశలాన్ని ప్రదర్శించారు. పాన్‌ ఇండియా రేంజ్‌లో వచ్చిన ఈ సినిమా రికార్డులు బద్ధలు కొట్టింది.

అంతర్జాతీయంగానూ ఈ మూవీ అనేక సెన్సేషన్లు క్రియేట్‌ చేస్తోంది. ఇటీవల జపాన్‌లో కూడా విడుదల చేశారు. అక్కడ మంచి రెస్పాన్స్‌ వచ్చింది. అనేక అవార్డులు కూడా ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రానికి వచ్చాయి. రీసెంట్‌గా న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డ్స్ 2022లో ఉత్తమ దర్శకుడిగా అవార్డు గెలుచుకున్నారు. ఇక తదుపరి ప్రాజెక్టు మహేష్‌బాబుతో కావడంతో జక్కన్న స్క్రిప్ట్‌ వర్క్‌లో నిమగ్నం అయ్యాడని చెబుతున్నారు.

ఈ నేపథ్యంలోనే కాస్త ఇంట్రస్టింగ్‌ టాపిక్‌ ఒకటి ఫిల్మ్‌ సర్కిళ్లలో తిరుగుతోంది. వీరిద్దరి కాంబోలో వస్తున్న మొదటి చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మూవీపై ఏ చిన్న అప్‌డేట్‌ వచ్చినా వెంటనే వైరల్‌ అవుతోంది. సాధారణంగా సినిమాల్లో నటించినందుకు యాక్టర్లు రెమ్యునరేషన్ తీసుకుంటూ ఉంటారు. కానీ కొంత మంది వచ్చిన కలెక్షన్ లో వాటాల వైపు మొగ్గు చూపుతుంటారు. ఇప్పటికే చాలా మంది ఆ విధానాన్ని అనుసరిస్తున్నారు.

తాజాగా మహేష్‌బాబు సైతం ఇదే విధానాన్ని అనుసరించాలని నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. తన అభిప్రాయాన్ని దర్శక ధీరుడు రాజమౌళి, చిత్ర ప్రొడక్షన్‌ హౌస్‌కు తెలియజేశాడట మహేష్‌ బాబు. ఈ చిత్రానికి స్వయంగా రాజమౌళి తన ప్రొడక్షన్‌ హౌస్‌ పేరును జత చేశారు. తద్వారా నిర్మాతగా మారినట్లయింది. రాజమౌళి సైతం సినిమాకు వచ్చే కలెక్షన్స్‌ ఆధారంగా రెమ్యునరేషన్‌ తీసుకుంటారు. అయితే, మహేష్‌బాబు నటించబోయే ఈ ప్రాజెక్టులో హాలీవుడ్‌ ప్రొడక్షన్‌ హౌస్‌ ఉండటంతో ఈ డీల్‌ అంత సులభం కాకపోవచ్చని చెబుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -