IPL Cricket: ఐపీఎల్ ఆక్షన్ లో ఫ్రాంచైజులు కనకవర్షం కురిపించిన ఆ ఐదుగురు ఆటగాళ్లు ఎవరో తెలుసా?

IPL Cricket: ఐపీఎల్ 2023 వేలం పాటకు ఆల్రెడీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. బీసీసీఐ దీనికి సంబంధించిన ఫైనల్ లిస్టును కూడా విడుదల చేయడం జరిగింది. వేలం పాటకు మొత్తం 991 మంది క్రీడాకారులు పేర్లు నమోదు చేసుకోగా ,లిస్టులో మొత్తం 405 మంది ప్లేయర్స్ చోటు దక్కించుకోగలిగారు. అయితే ఇందులో 273 మంది భారతీయ ఆటగాళ్లు కావడం గమనార్హం. మిగిలిన 132 మంది వివిధ దేశాలకు చెందిన ఆటగాళ్లు.

 

ఈ వేలం పాట డిసెంబర్ 23 మధ్యాహ్నం రెండు గంటలకు కొచ్చిలో ప్రారంభమవుతుంది. అయితే ఈ వేలం పాటలో బెస్ట్ ప్లేయర్స్ బేస్ ప్రైస్ రెండు కోట్ల రూపాయలు కాగ ఆ లిస్టులో ఇప్పటివరకు 19 మంది ఆడవాళ్లను చేర్చారు. అయితే వీరంతా విదేశీ క్రీడాకారులే. నెక్స్ట్ బేస్ ప్రైస్ ఒకటిన్నర కోటి కి 11 మంది ఆటగాళ్లు ఉండగా కోటి రూపాయల బేస్ ప్రైస్ కి 10 మంది ఆటగాళ్లు లిస్ట్ లో ఉన్నారు. భారత్ ప్లేయర్స్ అయిన మయాంక్ అగర్వాల్, మనీష్ పాండేలు ఈ కోటి రూపాయల ప్యాకేజీ లో ఉన్నారు.

 

రెండు కోట్ల బేస్ ప్రైస్ లో 19 మంది ఆటగాళ్లు ఉన్నప్పటికీ , ఈ సీజన్ వేలం పాటలో టాప్ ఫైవ్ లో ఉన్న పంచ పాండవులు వీళ్లే…

 

సామ్ కర్రన్ :
నివేదికల ప్రకారం ఈ వేలం పాటలో ఆల్రౌండర్ అయిన సామ్ కర్రన్ భారీ ధర పలికే అవకాశం ఉంది. టి20 ప్రపంచ కప్ లో మంచి ప్రదర్శనతో ఇంగ్లాండ్ జట్టును ఛాంపియన్గా నిలిపిన ఈ లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ అందరి దృష్టిని ఆకర్షించాడు. చెన్నై సూపర్ కింగ్స్ టీం లో నాలుగు సార్లు అతను సభ్యుడుగా ఉన్నాడు.

 

బెన్ స్టోక్స్ :

వన్డే మ్యాచెస్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న ఈ ఇంగ్లాండ్ ప్లేయర్ ప్రస్తుతం టెస్ట్ టీం కి కెప్టెన్ గా ఉన్నాడు. టి20 ప్రపంచ కప్ ఫైనల్లో అద్భుతమైన ఆటతో జట్టును చాంపియన్గా నిలబెట్టడంలో తన వంతు పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో రాబోయే వేలం పాటలో అతనిపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.

 

కామెరాన్ గ్రీన్ :
ఈ ఆక్షన్ కి హాజరవుతున్న 10 జట్లు టార్గెట్ చేసిన ఒకే ఒక ప్లేయర్ కామెరాన్ గ్రీన్ అని చెప్పొచ్చు. ప్రస్తుతం సూపర్ ఫామ్ లో ఉన్న ఈ ఆస్ట్రేలియన్ ప్లేయర్ కోసం ధర ఎంతైనా ఫ్రాంచసైజులు తగ్గేదే లేదంటున్నాయి.

 

రిలే రస్సో :

దక్షిణాఫ్రికా డేంజరస్ ఓపెనర్ రిలే పై ఈ ఆక్షన్ లో అంచనాలు భారీగా ఉన్నాయి. మంచి దూకుడు ప్రదర్శనతో భారీ షాట్లతో దూసుకుపోయే ఈ ప్లేయర్ కోసం పది టీములు తలపడనున్నాయి.

 

కేన్ విలియమ్సన్ :

న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ లాస్ట్ సీజన్లో హైదరాబాద్ సన్‌రైజర్స్ కెప్టెన్ గా బాధ్యతలు తీసుకున్నాడు. మంచి ఫామ్ లో ఉన్న కేన్ కోసం ఈసారి పోటీ గట్టిగానే ఉంటుంది అని సమాచారం.

 

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -