IPL 2023: వరల్డ్ కప్ విన్నర్ మీద కావ్య గురి.. కుదిరితే సన్ రైజర్స్ దశ తిరిగినట్టే..!

IPL 2023: ఇండియన్ ప్రీమియర్ లీగ్ – 2023 సీజన్‌కు గాను  ఇటీవలే రిటెన్షన్  ప్రక్రియ ముగిసింది. మరికొద్దిరోజుల్లో కొచ్చి (కేరళ) వేదికగా  వేలం జరుగబోతుంది.  అయితే  వేలానికి ముందే ఐపీఎల్  ట్రోఫీని రెండు సార్లు గెలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్.. తమ జట్టులో ప్రక్షాళణ చేపట్టింది. కోటానుకోట్లు పెట్టి  కొన్న  ఆటగాళ్లు స్థాయికి తగ్గట్గుగా రాణించకపోవడంతో  వారిని వదిలించుకుంది.  రూ. 14 కోట్ల విలియమ్సన్ తో పాటు  రూ. 10 కోట్ల నికోలస్ పూరన్ వంటి చాలా మందిని  రిటైన్ చేసుకోలేదు. అయితే  ఈసారి వేలంలో ఆ జట్టు కీలక ఆటగాళ్లను టార్గెట్ చేయనుంది.

రిటెన్షన్ ప్రక్రియలో  12 మందిని మాత్రమే రిటైన్ చేసుకున్న సన్ రైజర్స్.. వరల్డ్ కప్ విన్నర్ అయిన బెన్ స్టోక్స్ మీద కన్నేసింది.  ఈ మేరకు  సన్ రైజర్స్  యజమాని  కావ్య మారన్.. బెన్ స్టోక్స్ తో పాటు వరల్డ్ కప్ లో మెరిసిన ఆటగాళ్ల మీద టార్గెట్ పెట్టిందని సమాచారం.  స్టోక్స్ కోసం ఎంత ధరైనా చెల్లించేందుకు కావ్య పాప సిద్ధంగా ఉందని  తెలుస్తున్నది.

ప్రస్తుతం ఇంగ్లాండ్ టెస్టు జట్టు సారథిగా ఉన్న  బెన్ స్టోక్స్.. ఇంగ్లాండ్ గెలిచిన రెండు  ప్రపంచకప్ లలో కీలక సభ్యుడు. 2019 వన్డే ప్రపంచకప్ తో పాటు ఇటీవల ముగిసిన  టీ20 ప్రపంచకప్ లో కీలక ఇన్నింగ్స్ లు ఆడి ఇంగ్లాండ్ కు ఐసీసీ ట్రోఫీలు అందించడంలో విజయవంతమయ్యాడు. స్వతహాగా ఆల్ రౌండర్ అయిన  స్టోక్స్ లో కెప్టెన్సీ స్కిల్స్ కూడా ఉన్నాయి.  అతడిని తీసుకుంటే బ్యాటింగ్, బౌలింగ్ తో పాటు  కెప్టెన్ కూడా దొరికినట్టు అవుతుందని  కావ్య భావిస్తున్నది.

స్టోక్స్ కోసం వేలంలో ఎంత ధరైనా వెచ్చించేందుకు  కావ్య సిద్ధమవుతున్నది. ప్రస్తుతం సన్ రైజర్స్ ఖాతాలో రూ.  42.25 కోట్లు ఉన్నాయి. వేలంలో స్టోక్స్ ను దక్కించుకోవడానికి   సన్ రైజర్స్ ఎంతైనా ఖర్చు చేస్తే  అది మొదటికే మోసం వస్తుంది.   ఇతర జట్లు కూడా ఈ మేరకు వ్యూహాలు రచిస్తున్నాయి.  స్టోక్స్ కోసం సన్ రైజర్స్ భారీ ధర వెచ్చించేలా చూసి తర్వాత మిగిలిన ఆటగాళ్లను దక్కించుకునేందుకు  ప్రణాళికలు రచిస్తున్నాయి. ఇదే జరిగితే సన్ రైజర్స్ కు భారీ షాక్ తప్పదు. అందుకే బెన్  స్టోక్స్ విషయంలో  కావ్య ఆచితూచి అడుగులు వేయాలని భావిస్తున్నది.

ఒక్క బెన్ స్టోక్స్ ను తీసుకుంటే సన్ రైజర్స్ సమస్యలు గట్టెక్కవు.  అతడితో పాటు బ్యాటింగ్, బౌలింగ్ వైఫల్యాలపై  దృష్టి సారించాలి.  ఇప్పటివరకూ మిగతా జట్ల మాదిరిగానే సన్ రైజర్స్ కు కోర్ టీమ్ లేదు. ఈ వేలంతో అయినా  సన్ రైజర్స్ ఆ దిశగా ముందడుగు వేయాల్సి ఉంది.  గత రెండు సీజన్లలో పేలవ ప్రదర్శనతో  డీలా పడిన సన్ రైజర్స్ మరి ఈసారి వేలంలో ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్తుందో చూడాలి.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -