IPL Auction: ఐపీఎల్ వేలంలో తమ్ముడు ముందు నిలవలేకపోయిన అన్న!

IPL Auction: ఐపీఎల్ క్రికెట్ అభిమానులకు బాగా సుపరిచితమైన పేరు. అప్పుడే మొదలైన టీ20 ఫార్మెట్ ని అభిమానులకి బాగా దగరికి చేసిన టోర్నమెంట్ ఇది. ఇండియాలో మొదలైనప్పటికీ ఈ టోర్నమెంట్ కి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. కరోనా పుణ్యమా అని అభిమానులను స్టేడియం లోకి రానివ్వకున్నా ఓటీటీ లో బాగానే చూశారు. ఐపీఎల్ నీ చూసి మిగతా దేశాలు కూడా ఇలాంటి ప్రైవేట్ టోర్నమెంట్ లు ప్రారంభించాయి.

ఐపీఎల్ లో ఇప్పటివరకూ చూడని వింత!

అలాంటి టోర్నమెంట్ అభిమానులను పలకరించడానికి సిద్ధం అవుతోంది. ఇంకొన్ని నెలల్లో 2023 ఐపీఎల్ మొదలవుతుంది. సమ్మర్ స్పెషల్ గా వస్తుంది ప్రతి సంవత్సరం ఈ సక్సెస్ఫుల్ టోర్నమెంట్. అయితే ఈ సంవత్సరం వచ్చే ఐపీఎల్ కొంత ప్రత్యేకంగా ఉండబోతోంది. మినీ ఆక్షన్ ను నిర్వహించారు నిర్వాహకులు.

జట్లు అవసరం లేని ఆటగాళ్లను వదులుకుని కొత్తవారిని కొనడానికి ఈ మినీ ఆక్షన్. ఐపీఎల్ జట్లు తమకి నచ్చిన ఆటగాళ్లను కొనడానికి కోట్లు కుమ్మరించడానికి కూడా వెనకడుగు వేయలేదు. దీంతో ఆటగాళ్లు కోట్లు వెనకేసుకున్నారు. అలాంటి కొంత మంది ఆటగాళ్లను చూద్దాం. చాలా మంది ఆటగాళ్ళ జీవితం మారిపోయింది ఈ మినీ ఐపీఎల్ వల్ల. కొంత మంది యువ ఆటగాళ్లు కూడా మంచి ధర రాబట్టారు.

యువ ఆల్ రౌండర్ సామ్‌ కర్రన్‌ ఐపీఎల్ లో చరిత్ర సృష్టించాడు. పంజాబ్ కింగ్స్ జట్టు ఈ ఆటగడిని 18.5 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. ఐపీఎల్ మొదలుపెట్టినప్పటి నుంచి ఒక ఆటగాడు ఇంత ధర పలకడం జరగలేదు. అయితే కర్రన్ అన్న టామ్‌ కర్రన్‌ ని కొనుగోలు చేయడానికి ఎవరూ ఉత్సాహం చూపలేదు. ఇద్దరూ ఇంగ్లాండ్ టీమ్ కి ఆడుతున్నా సామ్ కర్రన్ కి మంచి రికార్డులు ఉన్నాయి. ఇటీవల పొట్టి ఫార్మెట్ లో విశ్వవిజేత ట్రోఫీ గెలిచిన ఇంగ్లాండ్ జట్టులో సామ్ కూడా ఉన్నాడు. అతను టోర్నీ ఆసాంతం మంచి ప్రదర్శన కనబరిచి తన జట్టుకు కావాల్సిన మద్దతు ఇచ్చాడు.

Related Articles

- Advertisement -

Trending News

- Advertisement -

Latest Posts