Avatar 2: ఆ మూవీ కలెక్షన్లను దాటే విషయంలో అవతార్2 ఫెయిలైందా?

Avatar 2: అవతార్ 2 సినిమా కోసం అందరూ ఎంతో ఆశతో ఎదురుచూశారు. ఎట్టకేలకు అవతార్ 2 సినిమా రిలీజ్ అయ్యింది. ప్రపంచంలోని సినీ అభిమానులంతా వేయి కళ్లతో అవతార్ 2 సినిమా కోసం ఎదురుచూడసాగారు. టీజర్, ట్రైలర్ అద్భుతంగా ఉండటంతో ఈ సినిమాను ఎలాగైనా చూడాలనుకుని చాలా ఉంది ఉండేవారు. ఎట్టకేలకు ఈ సినిమా విడుదలైంది. అయితే అవతార్ 2 కథ అంతగా లేదు. ఇది ఫ్యాన్స్ ను కాస్త నిరాశపరిచింది. కథ, కథనాలు అనేవి ఎన్నో చిత్రాల్లో కనిపించాయని కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

 

అవతార్ 2 సినిమా విజువల్స్ పరంగా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఇంకెవ్వరూ కూడా ఇలాంటి విజువల్ వండర్ ను క్రియేట్ చేయలేరు. ఇలాంటివి తీయాలంటే అది కేవలం జేమ్స్ కామెరాన్ వల్లే సాధ్యమవుతుంది అనడంలో అతిశయోక్తి లేదు. అయితే అవతార్ 2 సినిమా చాలా అంచనాల నడుమ విడుదలైనప్పటికీ కలెక్షన్లలో మాత్రం అంతగా రాబట్టలేదు. అవతార్ 2 కలెక్షన్లు అన్ని సినిమాల రికార్డులను బ్రేక్ చేస్తుందని అందరూ ఊహించారు.

 

అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అవతార్ 2 గత రికార్డులను బద్దలు కొట్టలేకపోయింది. అవెంజర్ ఎండ్ గేమ్ ఓపెనింగ్ డే రికార్డులను కూడా అవతార్ 2 సాధించలేకపోయింది. రెండు తెలుగు రాష్రాల్లో అయితే డబ్బింగ్ సినిమాల కేటగిరీలో కేజీయఫ్ ఎక్కువ కలెక్షన్లు సాధించి రికార్డు నెలకొల్పింది. అయితే కేజీయఫ్ చాప్టర్ 2 ఓపెనింగ్ డే రికార్డులను కూడా అవతార్ 2 బీట్ చేయలేక డీలా పడిపోయింది.

 

ఈ సంవత్సరంలో విడుదలైన కేజీయఫ్ చాప్టర్ 2 సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓపెనింగ్ డేకు రూ.31 కోట్లు వసూలు చేసింది. అయితే అవతార్ 2 మాత్రం కేవలం పద్నాలుగు కోట్లు మాత్రమే సాధించింది. దీంతో చివరకు కేజీయఫ్‌ని కూడా అవతార్ దాట లేకపోయిందని పలువురు పెదవి విరుస్తున్నారు. ఇండియా మొత్తంగా చూస్తే ఎండ్ గేమ్ రికార్డులను కూడా అవతార్ రెండో పార్ట్ సాధించలేకపోయింది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -