Nithya Menon: పసిబిడ్డను లాలిస్తున్న నిత్యామీనన్.. వైరల్ అవుతున్న ఫొటో!

Nithya Menon: మలయాళ చిత్రసీమ నుంచి వచ్చే నటీనటులను ఆదరించడంలో తెలుగు పరిశ్రమ ముందుంటోంది. అక్కడి నటీనటులు, సాంకేతిక నిపుణులకు అవకాశాలిచ్చి ఆదరిస్తోంది. ఇటీవల కాలంలో దుల్కర్ సల్మాన్ లాంటి హీరోకు ‘మహానటి’, ‘సీతారామం’ లాంటి బ్లాక్ బస్టర్లను ఇచ్చింది తెలుగు దర్శకులే. ఆయనకు ఇప్పుడు కేరళతోపాటు తెలుగు రాష్ట్రాల్లోనూ అభిమానులు ఎంతో మంది ఉన్నారు. ఇక మలబారు తీరం నుంచి వచ్చే అందగత్తెలపై కూడా మన దర్శక నిర్మాతలు ఫోకస్ పెడుతుంటారు.

 

అందానికి అందం, నటనకు నటనతో అదరగొట్టడంలో మలయాళీ భామలు ఆరితేరారు. అందుకే కేరళ కుట్టిలను తీసుకొస్తుంటారు తెలుగు మేకర్స్. అలా వచ్చి స్టార్స్ గా మారిన వారిలో నిత్యా మీనన్ ఒకరు. కథా ప్రాధాన్యమున్న చిత్రాలను ఎంచుకుంటూ కెరీర్ ను వైవిధ్యంగా మలుచుకున్న నటి ఆమె. అశ్లీలతకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా నటనను మాత్రమే నమ్మకున్నారామె. సాటిలేని నటనకు క్యూట్ వాయిస్ తో అందాన్ని తెస్తుందామె. యాక్టింగ్ తోపాటు డ్యాన్సులు, సింగింగ్ తోనూ తన పాపులారిటీని ఆమె రెట్టింపు చేసుకున్నారు.

 

నిత్యా మీనన్ పై కొన్నాళ్లుగా గాసిప్స్ వస్తున్నాయి. ఆమెకు ఇప్పటికే పెళ్లయ్యిందని, గర్భిణి అని పలు వెబ్ సైట్లలో కథనాలు కూడా వచ్చాయి. అయితే అది సినిమా కోసం చేసిన ప్రచారమని నిత్య సోషల్ మీడియా పోస్ట్ ద్వారా తేలిపోయింది. ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచారీ కోలకళ్ల సొగసరి. ఆమె చేతిలో పసిబిడ్డతో కనిపించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

 

కల్కి ఆశ్రమాన్ని సందర్శించిన నిత్య
బిడ్డతో నిత్య ఫొటోలు చూసిన వారు ఆమె నిజంగానే తల్లయ్యారంటూ లేనిపోని రూమర్స్ వ్యాప్తి చేస్తున్నారు. అయితే నిజం ఏంటంటే.. తాజాగా తిరుపతిలోని వరదయ్యపాలెం మండలం, బత్తలవల్లం గ్రామంలోని కల్కి ఆశ్రమాన్ని నిత్య సందర్శించింది. ఆ తర్వాత కాంభాగం గిరిజన ఆలయాన్ని ఆమె సందర్శించారు. అనంతరం అక్కడే ఉంటున్న గిరిజన ప్రజలతో కాసేపు ముచ్చటించారు. ఓ మహిళ చేతిలో ఉన్న చంటి పిల్లాడ్ని తీసుకుని లాలించారు. ఈ సందర్భంగా తీసిన ఫొటో వైరల్ అయ్యింది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -