Dhoni’s daughter: మెస్సీ పంపిన గిఫ్ట్‎కి ధోని కూతురు ఫిదా.. ఆనందంలో మహి ఫ్యాన్స్!

Dhoni’s daughter: ప్రపంచంలో ఎక్కువ మంది చూసే గేం ఫుట్ బాల్. ఈ మధ్యన జరిగిన ఫిఫా వరల్డ్ కప్ మేనియా గురించి అయితే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. యావత్ ప్రపంచం అంతా ఈ ఫుట్ బాల్ వేడుకను ఎంతో ఆసక్తిగా చూసింది. ఈ ఏడాది ఖతార్ వేదికగా జరిగిన ఫిఫా వరల్డ్ కప్ ను ప్రపంచంలో ఎక్కువ మంది చూడటం అనేది కూడా ఓ అరుదైన రికార్డుగా ఉంది.

 

డిసెంబర్ 18న ఫ్రాన్స్ తో జరిగిన హోరాహోరీ మ్యాచులో అర్జెంటీనా అద్భుత విజయాన్ని నమోదు చేసింది. దీంతో 2022 ఫిఫా వరల్డ్ కప్ అర్జెంటీనా సొంతమైంది. అర్జెంటీనాకు వరల్డ్ కప్ తీసుకురావడంలో ఆ టీం కెప్టెన్ లియోనల్ మెస్సీ ఎంతో కష్టపడ్డాడు. 35 సంవత్సరాల మెస్సీ చిన్నప్పటి నుండి తన దేశం కోసం వరల్డ్ కప్ ను గెలుచుకు రావాలనే దృఢ నిశ్చయంతో ఉండగా.. ఈ ఏడాది తన కలను సొంతం చేసుకున్నాడు.

 

ఫ్రాన్స్ తో జరిగిన ఫైనల్ మ్యాచులో అర్జెంటీనా గెలుపులో మెస్సీ ఎంతో కీలకం అవడంతో.. విజయం ఆ టీంని వరించింది. కాగా మెస్సీ ఆటకు ప్రపంచం మొత్తం ఫిదా అయింది. గతంలో కూడా మెస్సీకి ఎంతోమంచి ఆదరణ ఉండగా.. ఫిఫా వరల్డ్ కప్ తో అది రెట్టింపు అయింది. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఫ్యాన్స్ ను సొంతం చేసుకున్న మెస్సీకి భారత్ లో కూడా ఫాలోవర్స్ కి కొదువలేదు.

 

ఇండియాలో ఎంతో ఫేమస్ అయిన క్రికెట్ లో ఎంతో కీలకంగా ఉన్న ధోని, విరాట్ కోహ్లీ లాంటి వాళ్లు కూడా మెస్సీకి అభిమానులు. అయితే తాజాగా మెస్సీ ధోని కూతురికి పంపించిన ఓ గిఫ్ట్ అందరినీ ఆకట్టుకుంది. మెస్సీ అంటే ఎంతో అభిమానించే ధోని కూతురు జీవాకు మెస్సీ ఓ అరుదైన గిఫ్ట్ ను పంపించాడు. అర్జెంటీనా జెర్సీ మీద మెస్సీ సంతకం చేసి, దానిని జీవాకు గిఫ్ట్ గా ఇచ్చాడు. ‘జీవా కోసం’ అని మెస్సీ అర్జెంటీనా జెర్సీ మీద రాసి, దాని కింద సంతకం చేసి పంపాడు. ధోని కూతురు జీవా కోసం మెస్సీ చేసిన పనికి మహి ఫ్యాన్స్ ఆనందంలో ఉన్నారు. బుల్లి అభిమాని కోసం మెస్సీ ఇలాంటి పని చేయడం ఎంతో అభినందనీయం అంటూ అందరూ మెస్సీ చేసిన పనిని మెచ్చుకుంటున్నారు

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -