Rashmi Gautam: రష్మీ అవి చూపిస్తుంది.. కమెడియన్ పరువు తీసేశాడుగా!

Rashmi Gautam: యాంకర్‌ రష్మీ.. బుల్లితెరతోపాటు సినిమాల్లోనూ నటిస్తూ బిజీగా ఉంటోంది. సినిమా హీరోయిన్ల కంటే పెద్ద క్రేజ్‌ సంపాదించింది ఈ ముద్దుగుమ్మ. తొలుత సినిమా నటిగానే కెరీర్‌ మొదలు పెట్టింది రష్మీ. తర్వాత యాంకర్‌గా ఫేమస్‌ అయ్యింది. జబర్దస్త్‌ ద్వారా అనేక షోలు చేసింది. సుమారు ఎనిమిదేళ్లుగా ఆ షో చేస్తూనే ఉంది రష్మీ. క్రమంగా ఆమె రేంజ్‌ పెరుగుతూనే ఉంది. తాజాగా రష్మీ గౌతమ్‌ గురించి ఓ కమెడియన్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

 

యాంకర్‌గా రావడానికి ముందే కొన్ని సినిమాల్లో నటించింది రష్మీ గౌతమ్‌. ముఖ్యంగా సునీల్‌ సరసన నటించిన సీన్‌ ఫేమస్‌ అయ్యింది. అప్పుడప్పుడూ ఈ సీన్‌ను జబర్దస్త్‌లో కూడా చూపిస్తూ ఉంటారు. ప్రస్తుతం జబర్దస్త్‌తోపాటు అనేక టీవీ షోలు, బయట ఈవెంట్స్‌లో కూడా రష్మీ పాల్గొంటూ క్యాష్ చేసుకుంటోంది. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలన్నచందంగా కెరీర్‌ పీక్‌లో ఉన్నట్లుగానే నాలుగు రాళ్లు వెనకేసుకుంటోంది రష్మీ.

 

ఈ క్రమంలో జబర్దస్త్‌లో సుడిగాలి సుధీర్‌తో లవ్‌ ట్రాక్‌లో ఉన్నట్లు నటించి వ్యూయర్‌ షిప్‌ను భారీగా సంపాదించింది. దీని వల్ల ఇద్దరికీ పేరు వచ్చింది. సుధీర్‌ ఏకంగా సినిమా హీరో అయిపోయాడు. రష్మీ కూడా అనేక చిత్రాల్లో హీరోయిన్‌గా నటించింది. ఇప్పటికీ ఈమెకు అవకాశాలు తగ్గలేదు. మెండుగా వస్తున్నాయి. తన కెరీర్‌ను బ్రేకులు లేకుండా ముందుకు తీసుకెళ్తోంది.

 

హాట్‌ కామెంట్స్‌..
ప్రస్తుతం ఎక్స్‌స్ట్రా జబర్ధస్త్ షో చేస్తోంది రష్మీ. ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. ఇందులో యాంకర్ రష్మీ కూడా తన లుక్స్‌తో మెస్మరైజ్ చేసింది. ఇక, కమెడియన్లు అందరూ తమదైన పంచులతో నవ్వించారు. ఇలా ఉండగా, కమెడియన్‌ ప్రవీణ్ ఏకంగా యాంకర్ రష్మీ డ్రెస్సింగ్‌పై కామెంట్లు చేశాడు. అయితే, ఇప్పుడిది సంచలనం రేకెత్తిస్తోంది. నా పరిస్థితి ఎవరికీ రావొద్దు మేడమ్… ఇంత ఏజ్ వచ్చింది.. ఇంత అందంగా ఉంటా.. అయినా ఎవరూ పిల్లనివ్వట్లేదంటూ.. రష్మీ దగ్గరకు వెళ్లి తన నడుము చూపించాడు. దీంతో ఆమె తావీదులు ఎందుకు కట్టుకున్నావని ప్రశ్నిస్తుంది. మీరు ఇలాంటివి కట్టుకుని మాకు చూపిస్తుంటారంటూ.. ఆమె హాట్ షోపై కామెంట్ చేశాడు ప్రవీణ్‌.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -