Faima-Praveen: ఫైమా-ప్రవీణ్ విడిపోవడానికి ఆ కమెడియన్ కారణమా.. ఆయన వల్లే ఇలా జరిగిందా?

Faima-Praveen:  జబర్దస్త్ లో నటిస్తున్న కమెడియన్స్ కంటెంట్ కోసం కనెక్ట్ అవుతారో, టిఆర్పి రేటింగుల కోసం కనెక్ట్ అవుతారో, మనసుకు నచ్చి కనెక్ట్ అవుతారో తెలియదుగానీ, చూసే వాళ్లు మాత్రం తెగ కన్ఫ్యూజ్ అవుతారు. మొదట్లో ఈ విధంగా రష్మీ, సుదీర్ మాత్రమే కన్ఫ్యూజ్ చేసేవారు. కొన్నిసార్లు లవర్స్ అనేవారు, కొన్నిసార్లు కంటెంట్ కోసం అనేవారు ఆ జోడి హిట్ అవటంతో అలాంటి జోడీలు తర్వాత చాలానే పుట్టుకొచ్చాయి అందులో ఒకటి ఫైమా, ప్రవీణ్ జోడి.

వీళ్ళిద్దరి ప్రవర్తన, వీళ్లిద్దరి కంటెంట్ చూసేవాళ్ళకి ఒరిజినల్గా ప్రేమించుకుంటున్నారు అనిపించింది. ప్రవీణ్ కూడా చాలాసార్లు ప్రేమిస్తున్నానని చెప్పాడు.కానీ ఫైనల్ గా ఫైమా మాత్రం నో చెప్పేసిందంట అది ఏంటో చూద్దాం. ఈమధ్య ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు ప్రవీణ్. చాలా ఎమోషనల్ అవుతూ తన ఫెయిల్యూర్ లవ్ స్టోరీ గురించి చెప్పుకొచ్చాడు. ఫైమా తో తన ప్రేమ ఫ్రెండ్షిప్ తో మొదలైందని, తమ జర్నీ ఇంచుమించు కలిసే స్టార్ట్ అయిందని చాలా సందర్భాల్లో ఒకరికి ఒకరం సపోర్టుగా ఉన్నామని అందుకే ఆమెకి ఐ లవ్ యు చెప్పానని చెప్పాడు.

అయితే ఫైమా మాత్రం రిజక్ట్ చేసినట్లు చెప్పాడు. బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత ఫైమా లో మార్పు కనిపిస్తుంది అని అందరూ అంటున్నారు అని యాంకర్ అడిగిన ప్రశ్నకు అలాంటిదేమీ లేదు ఆమె బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత చాలా డిప్రెషన్ కి గురి అయింది. ఇప్పుడిప్పుడే కోలుకొని మళ్ళీ కెరీర్ పై దృష్టి పెడుతుంది అని చెప్పాడు. తను లవ్ యాక్సెప్ట్ చేయలేనంత మాత్రాన మేము విడిపోమని ఫ్రెండ్స్ గా కలిసే ఉంటామని చెప్పుకొచ్చాడు. అయితే ఫైమా తన లవ్ ని యాక్సెప్ట్ చేయకపోవడం తనకు చాలా బాధ కలిగించిందని కన్నీరు పెట్టుకున్నాడు.

అయితే ఫైమా కూడా చాలాసార్లు బిగ్ బాస్ లో తనకి ప్రవీణ్ చేసిన సహాయం గురించి చెప్పుకొచ్చింది. ఒకానొక దశలో తను కూడా ప్రవీణ్ ప్రేమలో పడింది. అయితే బయట వినిపిస్తున్న టాక్ ఏంటంటే ఒక జబర్దస్త్ కమెడియన్ ఫైమా లైఫ్ లో ఎంటర్ అవ్వటం వలన ఆమె ప్రవీణ్ని దూరం పెట్టింది అంటున్నారు. ఎంతవరకు నిజమో వాళ్ళకే తెలియాలి.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -