Banana: చలికాలంలో పిల్లలకు అరటిపండు తినిపిస్తే ఏం జరుగుతుందో తెలుసా?

Banana: సాధారణంగా తల్లిదండ్రులు పిల్లల ఆహార విషయంలో ఎన్నో రకాల జాగ్రత్తలు చేసుకుంటూ ఉంటారు. మరి ముఖ్యంగా చలికాలంలో పిల్లలకు పెట్టే ఆహారం విషయంలో తల్లిదండ్రులు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటూ ఉంటారు. చలికాలంలో వచ్చే దగ్గు జలుబు వంటి ఇన్ఫెక్షన్ల భారీ నుంచి పిల్లలను రక్షించుకోవడం కోసం సరైన ఆహారాన్ని అందించాలని చూస్తూ ఉంటారు. ప్రస్తుత కాలంలో అన్ని కల్తీ కావడంతో తల్లిదండ్రులకు ఏ ఆహారం పెట్టాలి ఆహారం పెట్టకూడదు అన్న విషయంలో అనేక సందేహాలు నెలకొంటున్నాయి. అలాగే చలికాలంలో చిన్నారులకు అరటిపండు తినిపించవచ్చా లేదా అన్న అనుమానం వస్తూ ఉంటుంది. మరి నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

 

అన్ని కాలాలలోనూ చిన్నారులకు అరటిపండు పెట్టవచ్చు. అరటిపండులో ఉండే పోషకాలు వారికి మేలు చేస్తాయి. అరటి పండులో పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ ఎ, బి, సి, విటమిన్ బి6 , ఐరన్‌, ఫైబర్‌, కార్బోహైడ్రేట్ వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. ఇవి పిల్లల మానసిక, శారీరక అభివృద్ధికి సహాయపడతాయి. పిల్లల డైట్‌లో అరటిపండు చేర్చడం వల్ల వల్ల వారి జ్ఞాపకశక్తి బలపడుతుంది. అరటిపండు వారిని యాక్టివ్‌గా ఉంచుతుంది. ఈ పండులో ఉండే విటమిన్ B6, మెగ్నీషియం కండరాలను రిలాక్స్ చేసి నిద్రకు ఉపకరిస్తాయి. అలాగే ఇవి తొందరగా శక్తిని ఇస్తాయి.

 

ఇందులో శక్తినిచ్చే క్యాలరీలతోపాటు పోషకాలూ అత్యధికంగా ఉంటాయి. అరటిపండులో ఫైబర్‌ సమృద్ధిగా లభిస్తుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. పిల్లల్లో మలబద్ధకం ఉంటే ఆ సమస్యను నివారిస్తుంది. ప్రతి సీజన్‌లో వారికి అరటిపండు పెట్టవచ్చు. కానీ చలి కాలంలో పిల్లలకు జలుబు, దగ్గు వంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఈ కాలంలో పిల్లలకు ఎప్పుడూ ఎండలో కూర్చున్నప్పుడు అరటిపండు తినిపించాలి. ఎండలో కూర్చొని అరటిపండు తింటే జలుబు, దగ్గు వస్తుందనే భయం ఉండదు. ఒకవేళ పిల్లలకు జలుబు, దగ్గు వంటి సమస్యలు ఉంటే అరటి పండు ఇవ్వకూడదు. ఎందుకంటె ఆ సమయంలో అరటిపండు పెడితే పిల్లలకు కఫం పెరిగే అవకాశం ఉంది. పిల్లలకు ఆరు నెలలు దాటిన తర్వత నుంచి అరటిపండు పెట్టవచ్చు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -