Bihar: రోడ్డుపై వరుడు పరుగులు.. ఛేదించి పట్టుకున్న వధువు!

Bihar: ప్రస్తుతం పెళ్లిలలో వింతలు చోటు చేసుకుంటున్నాయి. అంతా ఓకే ఐన తర్వాత పెళ్లి చివరి క్షణంతో వరుడు తాళికట్టనని చెప్పడం.. లేదా వధువు ఇది నాకు ఇష్టం లేని పెళ్లి అని చెప్పడం జరుగుతుంటాయి. ఇలా పెళ్లిళ్లలో జరుగుతున్న ఘటనలను వీడియోలు తీసి సోషల్‌ మీడియాల్లో వైరల్‌ చేస్తున్నారు.అలాంటి ఓ ఘటనే బిహార్‌లో చోటు చేసుంది. పెళ్లి కుదిరిన తర్వాత పెళ్లికి ముందుగానే రూ. 50 వేల కట్నం నగదు, ఓ బైక్‌ తీసుకున్నారు. అయితే.. వారిచ్చిన కట్నం నచ్చలేదో.. మరి అమ్మాయి నచ్చకనో తెలియదు కానీ.. పెళ్లి దగ్గరపడుతున్న కొద్ది అబ్బాయి తరఫున వారు వాయిదాలు వేస్తూ వస్తున్నారు. అడిగిన ప్రతిసారి వివిధ రకాల కారణాలు చెబుతూ పెళ్లి డేట్‌ను ముందుకు సాగదీస్తున్నారు. ఆ అమ్మాయి కనిసిస్తే చాలు.. అబ్బాయి పారిపోతున్నాడు. చివరికి అతన్ని పట్టుకుని పెళ్లి చేసుకుంది.

బీహార్‌లోని మెహకర్‌ గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి మహులి గ్రామానికి చెందిన యువతికి పెళ్లి కుదిర్చి మూడు నెలల క్రితమే నిశ్చితార్థం జరిపించారు. నిశ్చితార్థం సమయంలో ఒక బైక్, రూ. 50 వేలు కట్నంగా ఇచ్చారు. అయితే పెళ్లి తేదీ దగ్గర పడుతున్న ప్రతిసారీ వరుడి కుటుంబ సభ్యులు పెళ్లి వాయిదా వేస్తూ వస్తున్నారు. దీంతో వధువు, వధువు కుటుంబ సభ్యులు అసహనానికి గురయ్యారు. ఒకరోజు ఆ యువతి తన తల్లిదండ్రులతో కలిసి మార్కెట్‌కు వెళ్లినప్పుడు ఆ వ్యక్తి కనిపించాడు. అతనిదగ్గరకి వెళ్లి తనని పెళ్లి చేసుకోమని కోరగా ఆ వ్యక్తి ఏం మాట్లాడకుండా తప్పించుకునే ప్రయత్నం చేశాడు. అంతలోనే పరుగులు తీసేందుకు ప్రయత్నిస్తుండగా ఆ యువతి అతడిని పట్టుకుంటుండగా యువతి నుంచి దులిపించుకుని పారిపోయాడు.

అయితే..యువతి కూడా అతని వెంట పరుగులుతీ తీసింది. అతడి వెంట బంధువులతో పాటు, యువతి కూడా పరుగులు తీసి చివరకు పట్టుకున్న వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ ఘటన పోలీసుల దృష్టికి తీసుకెళ్లగా పోలీసులు ఇరు కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్‌ నిర్వహించి పెళ్లికి ఒప్పించారు. పోలీస్‌ స్టేషన్‌ పక్కనే ఉన్న గుడిలో వారికి పెళ్లి జరిపించారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ అనే కామెంట్లు చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -