Venkatesh: వెంకటేశ్ సౌందర్య కాళ్లు పట్టుకోవడం వెనుక ఇంత బాధ ఉందా?

Venkatesh: టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నటన పరంగా ఎన్నో గుర్తింపులు సొంతం చేసుకున్నాడు. ఇక హీరో గానే కాకుండా నిర్మాతగా కూడా మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. కలియుగ పాండవులు అనే సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అగ్ర హీరోలలో ఒకరిగా నిలిచాడు.

దాదాపు 70కి పైగా సినిమాల్లో నటించాడు. ఇక బాలీవుడ్ లో కూడా ఆయన ఒక సినిమాల్లో నటించాడు. అలా బాలీవుడ్ లో కూడా కొంత క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఈ మధ్య సిరీస్ లు కూడా చేస్తున్నాడు. ఇక వెంకటేష్ చేసే ప్రతి సినిమా కూడా ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునే లాగా ఉంటాయి. ఇక ఇదంతా పక్కన పెడితే అంతా పెద్ద హీరో అయినా వెంకటేష్ సౌందర్య కాళ్ళు పట్టుకున్నాడట. ఇంతకు అసలేం జరిగిందంటే.. ఆయన ఫ్యామిలీ ఆనియన్స్ మెప్పించిన సినిమాల్లో పవిత్ర బంధం సినిమా ఒకటి.

 

ఇక ఈ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా 1966 లో విడుదలయ్యి బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుంది. కారణం ఈ సినిమా ఫ్యామిలీ నేపథ్యంలో వచ్చిన సినిమా కాబట్టి. ఈ సినిమాను ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమాలో వెంకటేష్ సరసన సౌందర్య జంటగా నటించారు.

 

ఇక ఇందులో ఎస్పీ బాలసుబ్రమణ్యం, సుత్తివేలు, శుభలేఖ సుధాకర్ తదితరులు నటించారు. అయితే పవిత్ర బంధం సినిమాలో వెంకటేష్ సౌందర్య కాళ్లు పట్టుకున్నాడు. ఆ సినిమాలో ఫస్ట్ నైట్ సీన్లో ఆశీర్వదించమని సౌందర్య వెంకటేష్ కాళ్లు మొక్కుతుంది. దానికి వెంకటేష్ ఆశీర్వదించాల్సింది నేను కాదు పెద్దలు, దేవుళ్ళు అని చెబుతాడు. కానీ దానికి సౌందర్య పతి కూడా ప్రత్యక్ష దైవమే కదండీ అని.. ఈ రోజు నుంచి మీరే నాకు అన్నీ అని అంటుంది.

 

దీంతో వెంకటేష్ తిరిగి సౌందర్య కాళ్ళు మొక్కుతాడు. దీంతో సౌందర్య వెనక్కి జరిగి ఇది తప్పు కదా అండి.. మీరు నా కాళ్లు పట్టుకోవడమేంటి అని అడిగితే దానికి వెంకటేష్ నువ్వు నా కాళ్ళకి దణ్ణం పెట్టినప్పుడు లేని తప్పు.. నీ కాళ్ళకి దణ్ణం పెడితే వచ్చిందా తప్పు.. అని చెప్తాడు. అలాగే భర్తలు ఏమైనా దేవుళ్ళ అని ప్రశ్నిస్తాడు. ఇలా మహిళలను ఆకట్టుకునే విధంగా ఆ సీన్ జరిగింది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -