Akira: అకీరాను నన్ను మించిన స్టార్ చేస్తా.. పవన్ కు చరణ్ మాటిచ్చారా?

Akira: టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన మెగా వారసుడు, పాన్ ఇండియా స్టార్ రామ్ చరణ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ఎంత చెప్పినా తక్కువే. ఒక హీరోగా ఎంతో మంచి పేరు సంపాదించుకొని ఎంతో మంది ప్రేక్షకులను అభిమానులుగా మార్చుకున్నాడు. ఇక పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్ తో అభిమానుల నుండి గ్లోబల్ స్టార్ గా పేరు సంపాదించుకున్నాడు.

 

ఇక హీరోగా ఒక స్థానంలో నిలబడిన రామ్ చరణ్ వ్యక్తిగతంగా కూడా చాలామంది మనసులను దోచుకున్నాడు. అయితే రామ్ చరణ్ కు తన బాబాయ్ పవన్ కళ్యాణ్ అంటే చాలా అభిమానం. తన తండ్రిని ఎలా చూసుకుంటాడో తన బాబాయ్ పవన్ కళ్యాణ్ ని కూడా అలాగే చూసుకుంటాడు. ఇక పవన్ విషయంలో చరణ్ బాగా జాగ్రత్తలు కూడా తీసుకుంటాడు.

ఇదంతా పక్కన పెడితే పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా నందన్ తనను మించి స్టార్ హీరో చేస్తాను అని రామ్ చరణ్ మాట ఇచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అకీరాను కన్న కొడుకు కంటే ఎక్కువగా చూసుకుంటానని అన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం రామ్ చరణ్ తన తమ్ముడు అకీరా నందన్ కెరీర్ పై దృష్టి పెట్టాడని తెలుస్తోంది. అకీరా కెరీర్ విషయంలో పవన్ కు చరణ్ మాట కూడా ఇచ్చాడట.

 

ఇక పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ కొడుకే అకీరా. పవన్ రేణు దేశాయ్ నుండి విడిపోయినా కూడా తన కూతురు కొడుకు బాధ్యత తానే మోస్తున్నట్లు తెలిసింది. రేణు దేశాయ్ కూడా గతంలో హీరోయిన్ గా చేసిన సంగతి తెలిసిందే. కానీ పవన్ కళ్యాణ్ ని పెళ్లి చేసుకున్న తర్వాత కేవలం ఫ్యామిలీ కే తన జీవితాన్ని అంకితం చేసింది. ఇక రామ్ చరణ్ ఇచ్చిన మాట ప్రకారం.. తన తమ్ముడిని ఏ విధంగా చూసుకుంటాడో చూడాలి.

Related Articles

ట్రేండింగ్

Jagan Campaigners For TDP: టీడీపీకి జగన్ రెడ్డి స్టార్ క్యాంపెయినర్.. నమ్మకపోయినా వాస్తవం మాత్రం ఇదే!

Jagan Campaigners For TDP: వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ స్టార్ క్యాంపెయినర్ గా మారిపోయారు. ప్రజలు నమ్మిన నమ్మకపోయినా ఇదే వాస్తవమని తెలుస్తోంది చంద్రబాబు నాయుడు సూపర్...
- Advertisement -
- Advertisement -