D.V.V.Danayya: డీవీవీ దానయ్యకు ఆర్ఆర్ఆర్ ఛాన్స్ అలా వచ్చిందా?

D.V.V.Danayya: తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శక ధీరుడుగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన రాజమౌళి దర్శకుడిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఇక ఈయన దర్శకత్వంలో తాజాగా వచ్చిన చిత్రం RRR. ఈ సినిమాకు డివివి దానయ్య నిర్మాతగా వ్యవహరించారు.

ఇక ఈ సినిమా అంతర్జాతీయ స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకొని ఏకంగా ఆస్కార్ అవార్డును కూడా గెలుచుకోవడం విశేషం. ఇకపోతే ఈ సినిమా అవార్డు వేడుకలకు దానయ్య దూరంగా ఉండటంతో రాజమౌళి దానయ్య మధ్య మనస్పర్ధలు వచ్చాయంటూ ఏవేవో వార్తలు వచ్చాయి అయితే ఈ వార్తలపై దానయ్య స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు. రాజమౌళి దర్శకత్వంలో RRR వంటి ప్రిస్టేజియస్ సినిమా తీసినందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు.

 

ఈ సినిమా ద్వారా తాను బాగా లాభ పొందానని అయితే ఆస్కార్ కోసం తాను రూపాయి కూడా ఖర్చు చేయలేదని రాజమౌళి ఎంత ఖర్చు చేశారో తనకు తెలియదని తెలిపారు. ఇకపోతే ఈ సినిమా నిర్మించే అవకాశం ఎలా వచ్చిందనే విషయం గురించి కూడా ఈయన తెలిపారు. రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా చేయాలని ఆయనని అడగగా ఆయన మర్యాద రామన్న సినిమా చేద్దామని చెప్పారు. ఇలాంటి సినిమాలు కాదు పెద్ద సినిమా చేయాలని ఉందని చెప్పడంతో ప్రస్తుతం తను తన ప్రాజెక్టులతో రెండు మూడు సంవత్సరాలు బిజీగా ఉంటానని చెప్పారట.

 

ఇలా బాహుబలి వంటి ప్రాజెక్టుతో రాజమౌళి బిజీగా ఉండగా అప్పటివరకు దానయ్య చాలా ఓపికగా రాజమౌళి కోసం ఎదురు చూశారు. ఇలా రాజమౌళి దానయ్యకు ఇచ్చిన కమిట్మెంట్ తోనే ఆయన తన నిర్మాణంలో RRR వంటి సినిమాను నిర్మించే అవకాశం వచ్చిందని దానయ్య సంతోషం వ్యక్తం చేశారు. ఇక నా బ్యానర్లో నందమూరి హీరో మెగా హీరో కలిసి నటించడం గొప్ప విషయమని ఈయన తెలిపారు.ఇక రాజమౌళితో సినిమా చేయాలన్న ఉద్దేశంతో మర్యాద రామన్న సినిమాను కనుక ఒప్పుకొని ఉంటే దానయ్యకు RRR సినిమా ఛాన్స్ ఉండేది కాదని తెలుస్తుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -