Naga Chaitanya: వామ్మో.. నాగచైతన్య కొత్తింటి ఖరీదు అన్ని రూ.కోట్లా?

Naga Chaitanya: టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగచైతన్య గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. గత ఏడాది బంగార్రాజు సినిమాతో ప్రేక్షకులను పలకరించిన నాగచైతన్య ప్రస్తుతం కస్టడీ సినిమాలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇకపోతే నాగచైతన్య సమంతను పెళ్లి చేసుకున్న తర్వాత టాలీవుడ్ నటుడు మురళీమోహన్ ఇంటిని కొనుగోలు చేసి అక్కడే కొత్త కాపురం పెట్టిన సంగతి మనందరికీ తెలిసిందే.

ఇది ఇలా ఉంటే నాగచైతన్య సమంతతో కలిసి ఉన్నప్పుడే నాగార్జున ఇంటికి సమీపంలో ఉన్న ఒక స్థలాన్ని కొనుగోలు చేసి కొత్త ఇంటి నిర్మాణం ప్రారంభించారు. చైతన్య తన కలలకు అనుగుణంగా హైదరాబాద్ లోని అత్యంత ఖరీదైన ప్రాంతం జూబ్లీ హిల్స్ లో ఈ ఇంటి నిర్మాణం చేపట్టిన సంగతి తెలిసిందే. ఇటీవలే నాగచైతన్య ఆ ఇంట్లోకి గృహప్రవేశం చేసినట్టు కూడా వార్తలు వినిపించాయి.

 

కాగా నాగచైతన్య సకల సదుపాయాలతో స్విమ్మింగ్ పూల్, జిమ్ తదితర సౌకర్యాలతో తాను ఇష్టపడి కట్టుకున్న ఇంటి ఖర్చు గురించి అందుకో ఎన్ని కోట్లు ఖర్చు అయ్యుంటుంది అన్న అంశం గురించి జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. కాగా నాగ చైతన్య కొత్తింటి ఫొటోస్ సోషల్ మీడియాలో కనిపించడంతో అతని ఇంటి ఖరీదుపై అందరూ ఆరాలు మొదలు పెట్టారు ఫాన్స్, నెటిజన్స్. నాగచైతన్య ఆ ఇంటికోసం 15 కోట్లు ఖర్చు పెట్టి నిర్మించినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

 

ఇకపోతే గత ఏడాది నాగచైతన్య బంగార్రాజు అలాగే లాల్ సింగ్ చద్దా సినిమాలతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. బంగార్రాజు సినిమా పరవాలేదు అనిపించగా లాల్ సింగ్ చద్దా సినిమా డిజాస్టర్ గా నిలిచింది. నాగచైతన్య ప్రస్తుతం కస్టడీ సినిమాలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నారు.. మరి కొన్ని ప్రాజెక్టులు ప్రస్తుతం చర్చల దశలో ఉన్నట్లుగా తెలుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -