Aamir Khan: ఆ సినిమా వల్ల తన డబ్బుని వాపస్ చేసిన అమీర్ ఖాన్..

సినీ లవర్స్ కి బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. అమీర్ ఖాన్ సినిమా చూసిన వాళ్ళు ఎవరైనా తన యాక్టింగ్ కి ఫిదా అవ్వాల్సిదే. ప్రస్తుతం అమీర్ ఖాన్ బాలీవుడ్ లో స్టార్ హీరోగా ఒక రేంజ్ లో హడావిడి చేస్తున్నాడు. మిగతా హీరోలకు దీటుగా అమీర్ ఖాన్ తన నటనను కనబరుస్తున్నాడు.

ఇదిలా ఉంటే ఇటీవలే బాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా లాల్ సింగ్ చద్దా. ఈ సినిమా కు అద్వైత్ చందన్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా 1994 లో అమెరికన్ గంప్ యొక్క రీమేక్. ఈ సినిమాలో అమీర్ ఖాన్ సరసన కరీనాకపూర్ నటించింది. దాదాపు 180 కోట్లతో నిర్మించిన ఈ సినిమాకు బి టౌన్ ప్రేక్షకులు భారీ అంచనాలు వేసుకున్నారు.

18 స్టూడియోస్, అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ నుంచి ఈ చిత్రాన్ని నిర్మించారు. అయినప్పటికీ ఈ సినిమా బాలీవుడ్ ప్రేక్షకులను నిరాశ పరచక తప్పలేదు. అంతేకాకుండా నిర్మాతలకు ఈ సినిమా భారీ నష్టాన్ని చెవి చూపించింది. ఇక అమీర్ ఖాన్ అయితే ఈ సినిమాకు 50 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తుంది. ఇక సినిమా ఇంత ఘోరంగా పరాజయపాలు అయ్యాక అమీర్ ఖాన్ ఒక నిర్ణయానికి వచ్చాడు.

అదేమిటంటే తన పూర్తి రెమ్యూనేషన్ ను తిరిగి ఇవ్వాలని నిర్ణయించుకున్నాడట. ఇక అమీర్ ఖాన్ తన రెమ్యూనేషన్ మొత్తం తిరిగి ఇచ్చిన తర్వాత 18 స్టూడియోస్ తన మిగిలిన నష్టాన్ని సరిపెట్టుకున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమా కోసం అమీర్ ఖాన్ నాలుగు సంవత్సరాలు కష్టపడినట్లు తెలుస్తుంది. ఏదేమైనా ఈ కష్టం మొత్తం చివరికి గంగలో కలిపినట్లుగా అయింది. మొత్తానికి అమీర్ ఖాన్ తన కష్టాన్ని, డబ్బును లాస్ అయినట్లు తెలుస్తుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -