Nagarjuna: ఈ సినిమాతో స్టార్ హీరోగా నువ్వు ఎదగవని చైతూతో నాగార్జున అన్నాడట!

Nagarjuna: తెలుగు ప్రేక్షకులకు నాగార్జున గురించి పెద్దగా పరిచయంకర్లేదు. ప్రస్తుతం టాలీవుడ్లో అగ్రస్టార్ హీరోగా ఓ వెలుగు వెలుగుతున్నాడు. నాగార్జున ప్రస్తుతం కుర్ర హీరోలతో సమానంగా సినీ అవకాశాలు అందుకుంటూ తెలుగు ఇండస్ట్రీలో వెలుగుతున్నాడు. ఇక రణ బీర్ కపూర్, అలియా భట్ కాంబినేషన్ లో వచ్చిన బాలీవుడ్ బ్రహ్మాస్త్ర సినిమాలో నటించాడు.

కాగా ఈ సినిమాకి దర్శకుడు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించాడు. ఇటీవల విడుదలైన ఈ సినిమా బాయ్ కాట్ ట్రెండ్ ను ఒక రేంజ్ లో అనగ దొక్కింది. సెప్టెంబర్ 9న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో జాతీయ మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడిన నాగార్జున పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు. ఈ క్రమంలోనే నాగచైతన్య బాలీవుడ్లో తొలి పరిచయమైన లాల్ సింగ్ చద్దా గురించి స్పందించాడు నాగార్జున.

ఈ సినిమాలో అమీర్ ఖాన్ టైటిల్ పాత్రను చేయగా అతడు స్నేహితుడు బాలరాజు జోడీ గా నాగచైతన్య నటించాడు. కాగా ఆగస్టు 11న ప్రేక్షకులు ముందుకు వచ్చిన సినిమా భారీ స్థాయిలో విఫలం అయ్యింది. కాగా ఈ సినిమా గురించి నాగార్జున మాట్లాడుతూ లాల్ సింగ్ చద్దా సినిమా చేస్తున్న సమయంలో ఇది నీకు స్టార్ గా గుర్తింపు తీసుకు రాదని మంచి నటుడుగా మాత్రమే ప్రేక్షకులు నిన్ను గుర్తిస్తారని నాగార్జున నాగచైతన్యకి చెప్పాడట.

ఆ విషయాన్ని చైతూ కూడా అంగీకరించి తాను నటుడిగా పేరు తెచ్చుకోవాలనే ఈ సినిమా చేస్తున్నట్లు తెలిపాడట. అంతేకాకుండా నాగార్జున మా ఫ్యామిలీకి సంబంధించిన ప్రతి సినిమా విడుదల రోజు నెగిటివ్ టాక్ అందుకున్న.. పాజిటివ్ టాక్ అందుకున్నప్పటికీ మేమంతా ఒకేలా ఉంటామని తెలిపాడు. కానీ బాలీవుడ్ లో తన అదృష్టం పరీక్షించుకోవాలని వెళ్ళిన నాగచైతన్య కి మాత్రం నిరాశ తప్పులేదు .

Related Articles

ట్రేండింగ్

YCP-TDP: చంద్రబాబు అరెస్ట్ తో రగిలిపోతున్న టీడీపీ.. అరెస్ట్ పై వైసీపీ రియాక్షన్ ఏంటంటే?

YCP-TDP:  చంద్రబాబు నాయుడుని ఆధారాలు లేని కేసులో అరెస్టు చేసి జైల్లో పెట్టిన జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఏం చేస్తున్నాడు అంటే చంద్రబాబు నాయుడుని జైల్లో పెట్టిన సందర్భంగా పండగ చేసుకుంటూ బాగా...
- Advertisement -
- Advertisement -