Samantha: చైతన్య శోభిత మధ్య బంధమే సమంత విడాకులకు కారణమా?

Samantha: టాలీవుడ్ అక్కినేని హీరో నాగచైతన్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నాగచైతన్య ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. గత ఏడాది బంగార్రాజు, లాల్ సింగ్ చద్దా సినిమాలతో ప్రేక్షకులను పలకరించిన నాగచైతన్య ప్రస్తుతం కస్టడీ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ ని జరుపుకుంటున్న ఈ సినిమా మరికొద్ది రోజుల్లోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇకపోతే ఈ మధ్యకాలంలో నాగచైతన్య, శోభిత ధూళిపాళ ఈ ఇద్దరు పేర్లు సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్నాయి. కాగా వారిద్దరి మధ్య ఏదో ఉందని, వారిద్దరూ ప్రస్తుతం డేటింగ్ లో ఉన్నారు అంటూ గత కొంతకాలంగా వార్తలు జోరుగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా వీరిద్దరూ గతంలో హాలిడే ట్రిప్ కి వెళ్ళినట్లు కూడా వార్తలు వినిపించాయి. ఇది ఇలా ఉంటే తాజాగా వీరికి సంబంధించిన మరో ఫోటో సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది.

 

చైతూ, శోభితా ధూళిపాళ లండన్‌ లోని ఒక రెస్టారెంట్‌కు వెళ్లిన సమయంలో అక్కడ చెఫ్ సురేందర్ మోహన్ నాగ చైతన్యతో కలిసి ఫోటో దిగారు. అందుకు సంబందించిన ఫోటోని సురేందర్ సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. ఆ ఫోటో బ్యాగ్రౌండ్ లో టేబుల్ వద్ద శోభిత తన మొఖం కనిపించకుండా చేయి అడ్డుపెట్టుకొని ఉన్న ఫోటో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. కాగా ఆ ఫోటోని చూసిన నెటిజన్స్ ఆమె శోభితానే అని కన్ఫర్మ్ చేస్తున్నారు.

 

ఇకపోతే శోభిత విషయానికి వస్తే.. ఈమె హీరో అడివి శేష్ తో కలిసి గూడచారి మేజర్ సినిమాలలో నటించిన విషయం తెలిసిందే. ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు వెబ్ సిరీస్ లలో నటిస్తూ దూసుకుపోతోంది. ఇక ప్రస్తుతం నాగ చైతన్యతో కలిసి కస్టడీ సినిమాలో నటిస్తోంది. తమిళ దర్శకుడు వెంకట ప్రభు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

Related Articles

ట్రేండింగ్

Election Campaigns: ఎన్నికల వేళ గరిష్టంగా రోజుకు 5,000 రూపాయలు.. కూలీలకు పంట పండుతోందా?

Election Campaigns: ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల ప్రచారం చూస్తుంటే ఇవి అత్యంత ఖరీదైనవి గా కనిపిస్తున్నాయి. ఎందుకంటే గతంలో ఎన్నికల సమయంలో పార్టీ నాయకుల మీద అభిమానంతో స్వచ్ఛందంగా జనాలు...
- Advertisement -
- Advertisement -