Naga Chaitanya: నాగచైతన్య ఆ సినిమాలో మేకప్ లేకుండా నటిస్తున్నారా?

Naga Chaitanya: అక్కినేని నాగచైతన్యకు లవ్ స్టోరీ సినిమా తర్వాత ఆశించిన స్థాయిలో పెద్దగా ఫలితాలు రాలేదని చెప్పాలి. ఈ సినిమా తర్వాత నాగచైతన్య పలు సినిమాలలో నటించారు. అయినప్పటికీ ఈయన మాత్రం సరైన సక్సెస్ అందుకోలేకపోతున్నారు. తాజాగా మరోసారి లవ్ స్టోరీ కాంబినేషన్ రిపీట్ అవ్వబోతుంది. మరోసారి నాగచైతన్య సాయి పల్లవి తో కలిసి జతకట్టబోతున్నారు.

 

ఇలా వీరిద్దరి కాంబినేషన్లో డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వంలో తండేల్ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా యదార్థ సంఘటనల ఆధారంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఈ సినిమా ఉడిపి షెడ్యూల్ చిత్రీకరణ పూర్తి చేసుకుని దాదాపు 45 రోజులపాటు ఈ షెడ్యూల్ చిత్రీకరణలో చిత్ర బృందం పాల్గొన్నారు.

తాజాగా ఈ షెడ్యూల్ కి సంబంధించిన వర్కింగ్ స్టిల్స్ సోషల్ మీడియాలో విడుదల చేయగా ఇవి కాస్త వైరల్ గా మారాయి. ఇందులో నాగచైతన్య లుక్స్ అందరిని ఆకట్టుకున్నాయి. అయితే ఈ సినిమాలో ఈయన మేకప్ లేకుండా నటిస్తూ పెద్ద రిస్క్ చేస్తున్నారని చెప్పాలి. ఒక మత్స్యకారుడి జీవిత కథ ఆధారంగా ఈ సినిమా రాబోతున్నటువంటి తరుణంలో నాగచైతన్యకు కూడా పెద్దగా మేకప్ లేదని తెలుస్తోంది.

 

గీత ఆర్ట్స్ బ్యానర్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే లాంగ్ షెడ్యూల్ చిత్రీకరణ పూర్తి కావడంతో కొద్దిరోజుల పాటు విరామం తీసుకున్న అనంతరం చందు మొండేటి ఈ నెలలోనే మరొక షెడ్యూల్ కూడా ప్రారంభించబోతున్నారని తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో సాయి పల్లవి పాత్రకు సంబంధించిన ఫోటోలు కూడా ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -