LIC policy: ఈ ఎల్ఐసీ పాలసీ గురించి తెలుసా.. రూ.కోటి పొందే అవకాశం!

LIC policy: లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వేర్వేరు వర్గాల కస్టమర్ల కోసం పలు రకాల పాలసీలను అందిస్తోంది. కస్టమర్ల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు వేర్వేరు ఎల్ఐసీ పాలసీలను ప్రకటిస్తూ ఉంటుంది. అయితే పలు కారణాలతో కొన్ని పాలసీలను కొన్ని రోజుల తర్వాత నిలిపివేస్తుంది ఎల్ఐసీ. ఇది ఇలా ఉంటే ఇప్పుడు మరో పాలసీని నిలిపివేయబోతున్నట్టు ప్రకటించింది. గతేడాది లాంఛ్ చేసిన ఎల్ఐసీ ధన్ వర్ష ప్లాన్‌ను 2023 మార్చి 31 వరకే అందుబాటులో ఉంటుందని ఎల్ఐసీ ప్రకటించింది.

అంటే రేపటి వరకు మాత్రమే ఈ ఎల్ఐసి పాలసీ అందుబాటులో ఉండనుంది. ఈ క్రమంలోనే వేర్వేరు ధన వర్ష లిమిటెడ్ ప్లాన్ అని, ఇంకొన్ని రోజులే ఈ పాలసీ అందుబాటులో ఉంటుందని, 2023 మార్చి 31 లోపు కొనుగోలు చేయొచ్చని https://licindia.in/ వెబ్‌సైట్‌లో లేదా సమీపం లోనే బ్రాంచ్‌లో లేదా ఎల్ఐసీ ఏజెంట్ దగ్గర ఈ పాలసీ తీసుకోవచ్చని ఎల్ఐసీ ట్వీట్ చేసింది. ఎల్ఐసీ ధన వర్ష ప్లాన్ విశేషాలు చూస్తే ఇది నాన్ లింక్డ్, నాన్ పార్టిసిపేటింగ్, ఇండివిజ్యువల్, సేవింగ్స్, లైఫ్ ఇన్స్యూరెన్స్ ప్లాన్. పాలసీహోల్డర్లకు రక్షణతో పాటు సేవింగ్స్ కూడా అందించడం ఈ పాలసీ ప్రత్యేకత.

 

పాలసీహోల్డర్ మరణిస్తే వారి కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలుస్తుంది ఈ పాలసీ. అలాగే మెచ్యూరిటీ సమయంలో కూడా ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బును అందిస్తుంది. ఈ పాలసీలో పలు రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఈ పాలసీ రెండు ఆప్షన్స్‌తో లభిస్తుంది. పాలసీ టర్మ్ కూడా వేర్వేరుగా ఉంటుంది. 15 ఏళ్ల టర్మ్‌తో పాలసీకి కనీస వయస్సు 3 ఏళ్లు కాగా, 10 ఏళ్ల టర్మ్‌తో పాలసీకి కనీస వయస్సు 10 ఏళ్లు. ఎల్ఐసీ ధన వర్ష ప్లాన్ కనీస మెచ్యూరిటీ వయస్సు 18 ఏళ్లు. ఇది సింగిల్ ప్రీమియం పాలసీ.

 

అంటే ప్రీమియం ఒకసారి చెల్లిస్తే చాలు. ఎల్ఐసీ ధన్ వర్ష ప్లాన్‌కు యాక్సిడెంటల్ డెత్ అండ్ డిసేబిలిటీ బెనిఫిట్ రైడర్, న్యూ టర్మ్ అష్యూరెన్స్ రైడర్ లాంటి ఆప్షన్స్ ఉన్నాయి. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపులు పొందొచ్చు. ఈ పాలసీని ఎల్ఐసీ ఏజెంట్ల దగ్గర, ఎల్ఐసీ కార్యాలయాల్లో తీసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో కూడా ఈ పాలసీ అందుబాటులో ఉంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -