Star Hero: ఆ స్టార్ హీరో ప్రియురాలు చెప్పులు మోశాడా.. కారణమేంటంటే?

Star Hero: ముఖేష్ అంబానీ నీతా అంబానీ రెండు రోజుల క్రితం నీతా అంబానీ కల్చరల్ సెంటర్ ప్రారంభించిన విషయం మనకు తెలిసిందే. ఈ కార్యక్రమం ప్రారంభోత్సవంలో భాగంగా పెద్ద ఎత్తున వ్యాపారవేత్తలు, సినీ, రాజకీయ నాయకులు, క్రీడా రంగానికి చెందినటువంటి సెలబ్రిటీలు తరలివచ్చారు. ఇలా పెద్ద ఎత్తున సెలబ్రిటీలతో ఈ కార్యక్రమం ఎంతో ఘనంగా జరిగింది. ఇక ఈ వేడుకకు ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కూడా హాజరయ్యారు.

ఈయన తన ప్రేయసి సింగర్ స‌బా అజాద్ తో క‌లిసి నీతా అంబానీ క‌ల్చ‌ల‌ర్ సెంట‌ర్ ప్రారంభోత్స‌వానికి హాజ‌రైన ఈయన ఈ కార్యక్రమంలో తన స్టార్డమ్ పక్కనపెట్టి ఎంతో సింప్లిసిటీని ప్రదర్శించారు. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ అమిత్ అగర్వాల్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే ఈయనతో కలిసి సభ ఆజాద్ ఫోటోలు దిగుతూ ఉండగా వెనక హృతిక్ రోషన్ ఆమె చెప్పులు చేతితో పట్టుకొని నిలుచున్నారు.

 

ఇలా అంత పెద్ద వేడుకలో ఒక స్టార్ హీరో తన ప్రియురాలు చొప్పులను మోస్తూ కనిపించడంతో ఈ ఫోటో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఫోటో చూసినటువంటి ఒక నెటిజన్ ఈ విషయాన్ని ఐడెంటిఫై చేస్తూ అంత పెద్ద స్టార్ హీరో అయిండు కొని తన ప్రియురాలు చెప్పులను ఎంత సింపుల్ గా పట్టుకొని నిలుచున్నారో చూడండి అంటూ నేటిజన్ కామెంట్ చేశారు. ఇక ఈ ఫోటోపై మరికొందరు స్పందిస్తూ ఆయన ఉత్తమ ప్రియుడు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

 

ఇక ఇండస్ట్రీలో అగ్ర హీరోగా కొనసాగుతున్నటువంటి హృతిక్ రోషన్ 2000 సంవత్సరంలో ప్రముఖ ఇంటీరియర్ డిజైనర్ సుజానే ఖాన్ ను పెళ్లి చేసుకున్నారు.ఇక ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు జన్మించిన తర్వాత 2014 సంవత్సరంలో విడాకులు తీసుకుని విడిపోయారు. ఇలా విడాకులతో విడిపోయినటువంటి హృతిక్ రోషన్ తిరిగి సబాతో రిలేషన్ లో ఉంటున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -