Kangana: వైరల్ అవుతున్న కంగనా షాకింగ్ కామెంట్స్.. మరీ ఘోరమంటూ?

Kangana: బాలీవుడ్ బ్యూటీ నటి ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. కంగానా తరచూ ఏదో ఒక వివాదంతో సోషల్ మీడియాలో నిలుస్తూనే ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. సమాజంలో జరిగే పలు విషయాల పట్ల స్పందిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ కాంట్రవర్సీ క్వీన్ గా కూడా పేరు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. అంతేకాకుండా ఏ విషయాన్ని అయినా కూడా ఉన్నది ఉన్నట్టుగా కుండ బద్దలు కొట్టినట్టుగా మాట్లాడుతూ ఉంటుంది. కంగానా బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.


ఎటువంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి స్టార్ గా ఎదిగింది కంగానా. ఈమె పేరు చెప్పగానే చాలామంది భయపడుతూ ఉంటారు. అందుకు గల కారణం కూడా లేకపోలేదు. కంగనా ఏదైనా కూడా కుండబద్దలు కొట్టినట్టుగా ముఖం మీద మాట్లాడేస్తూ ఉంటుంది. చాలామంది ఈమెను విమర్శించడానికి ఈమె అంటే నచ్చకపోవడానికి కారణం కూడా ఇదే అని చెప్పవచ్చు. ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియా ఫ్యాషన్ ఇన్ఫ్లుయేన్సర్ డైట్ సభ్యా కంగనా అవుట్ ఫిట్ విమర్శిస్తూ వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

ఆమె వేసుకున్న డ్రెస్ తనకి అస్సలు నచ్చలేదని ఓపెన్ గా చెప్పుకొచ్చింది. దీంతో కంగానా ఆ మాటలపై స్పందించింది. తనను ఎగతాళి చేసిన వారికి ఇచ్చి పడేసింది. ఎందుకో తెలియదు నాకు ఇలాంటి బట్టలు నచ్చుతాయి. నేను ఫ్యాషన్ ను ద్వేషిస్తున్నానని ఎప్పుడు చెప్పలేదు. కానీ ఇండియన్ ట్రెడిషన్ బట్టలు అంటే చాలా ఇష్టం. ఇండియా ఉత్పత్తులని ఎక్కువగా ఎంకరేజ్ చేయాలని ఇలా చేస్తున్నాను. ఎక్కడ సంపాదించుకున్నామో అక్కడే ఖర్చు చేయడం మంచిది. అందుకే ఇలాంటి దుస్తులు ధరిస్తున్నాను ..పడుకునేటప్పుడు కూడా నాకు ఇలాంటి బట్టలు వేసుకోవడమే ఇష్టం అంటూ ఓపెన్
గా మాట్లాడింది కంగనా.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -