Lasya Manjunath: ఆసుపత్రి పాలైన లాస్య.. అసలు ఏమైందంటే?

Lasya Manjunath: యాంకర్ లాస్య ఈ పేరు తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. 8 ఏళ్ల క్రితం సంథింగ్ స్పెషల్ గా పరిచయమై.. బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైంది. ఇక తన ప్రత్యేక వాయిస్ తో క్యూట్ ఎక్స్ప్రెషన్ తో తను ఒక స్పెషల్ లా గుర్తింపు సంపాదించుకుంది. ఇక ఈ అమ్మడు పెళ్లి తర్వాత అంతగా కనిపించలేదు.

అయినప్పటికీ యూట్యూబ్ లో లాస్య టాక్స్ అంటూ సోషల్ మీడియాలో తెగ హడావిడి చేస్తుంది. ఇక బిగ్ బాస్ సీజన్ 4 కు ఈ అమ్మడు ఎంట్రీ ఇచ్చి బుల్లితెర ప్రేక్షకులను మరోసారి ఆకట్టుకుంది. ఇక సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్ గా ఉండే లాస్య ఎప్పటికప్పుడు తన అప్ డేట్స్ సోషల్ మీడియాలో పంచుకుంటుంది.

ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ వీడియోలతో యూట్యూబ్లో హడావిడి చేస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ అమ్మడు హాస్పటల్ పాలయినట్లు తెలుస్తుంది. ఈ విషయాన్ని తన భర్త మంజునాథ్ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతా ద్వారా వెల్లడించాడు. గెట్ వెల్ సూన్ అంటూ ఒక పోస్ట్ బయట పెట్టాడు. ఈ విషయం తెలుసుకున్న లాస్య అభిమానులు ఒక రేంజ్ లో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా లాస్యకు ఉన్నట్లుండి ఏమైందని ఆలోచన వ్యక్తం చేస్తున్నారు.

అసలు లాస్య హాస్పిటల్ లో ఎందుకు చేరింది అన్న విషయంపై ఎటువంటి క్లారిటీ లేకుండా పోయింది. ఇక లాస్య భర్త కూడా ఈ విషయం గురించి పూర్తిగా క్లారిటీ ఇవ్వలేదు. ఈ విషయం తెలుసుకున్న పలు సెలబ్రేటీలు లాస్య త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు. అసలు లాస్య హాస్పిటల్ లో ఉండడానికి కారణం తెలియాలి అంటే.. తన భర్త మరో అప్ డేట్ ఇచ్చేవరకు వేచి చూడాల్సి ఉంది. ఇక లాస్య కు సంబంధించిన ఆ వీడియోవైపు మీరు కూడా ఒక లుక్ వేయండి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -