Salman Khan: వామ్మో.. సల్మాన్ ఖాన్ ఏకంగా ఆ రేంజ్ లో ఆస్తులు సంపాదించారా?

Salman Khan: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సల్మాన్ ఖాన్ బాలీవుడ్ ప్రేక్షకులతో పాటు టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. బాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి స్టార్ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరచుకున్నాడు. తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా గుర్తింపును సంపాదించుకున్నారు సల్మాన్ ఖాన్. అభిమానులు సల్మాన్ ఖాన్ ని ముద్దుగా కండల వీరుడు అని కూడా పిలుస్తూ ఉంటారు.

సల్మాన్ ఖాన్ తో పాటు సోదరులు నటులు అర్బాజ్ ఖాన్, సోహైల్ ఖాన్ కూడా సినిమా ఇండస్ట్రీలో హీరోలుగా రాణిస్తున్న విషయం తెలిసిందే. సినిమాలలో నటించే సల్మాన్ ఖాన్ తో పాటు ఇద్దరు తమ్ముళ్లు కూడా బాగానే సంపాదించారు. సల్మాన్ ఖాన్ ప్రస్తుతం ముంబైలోనే గెలాక్సీ అపార్ట్మెంట్లో నివసిస్తున్న విషయం తెలిసిందే. ఒకవైపు సినిమాల్లో హీరోగా నటిస్తూనే మరోవైపు బుల్లితెరపై హోస్ట్ గా అలరిస్తున్నారు సల్మాన్ ఖాన్. ఇకపోతే సల్మాన్ ఖాన్ ఒక్కో సినిమాకు 10 – 15 కోట్ల పారితోషికం అందుకుంటున్న విషయం తెలిసిందే. సినిమాల సంగతి పక్కన పెడితే సల్మాన్ ఖాన్ నెలవారి సంపాదన 16 కోట్ల వరకు ఉంటుందని అంచనా.

ఇకపోతే సల్మాన్ ఖాన్ ఆస్తి విలువ సుమారు 2,800 కోట్లు అని తెలుస్తోంది. కేవలం సల్మాన్ ఖాన్ మాత్రమే కాకుండా ఆయన సోదరులు కూడా భారీగానే సంపాదించారు. ఇది ఇలా ఉంటే సల్మాన్ ఖాన్ ఇటీవలె చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమాలో కీలకపాత్రలో నటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం బాలీవుడ్ సల్మాన్ ఖాన్ ఒక హిందీ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఆ సినిమా నుంచి ఇటీవలె బతుకమ్మ సాంగ్ విడుదలైన విషయం తెలిసిందే. ఆ సాంగ్ లో సల్మాన్ ఖాన్, విక్టరీ వెంకటేష్, రామ్ చరణ్ ముగ్గురు కలిసి చిందులు వేసే విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన సాంగ్ యూట్యూబ్ లో ట్రెండింగ్ అవుతూ దూసుకుపోతోంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -