Bollywood: హీరోయిన్ల విషయంలో ఈ బాలీవుడ్ స్టార్ హీరో అలాంటి వ్యక్తా?

Bollywood: బాలీవుడ్ టాప్ హీరోగా సల్మాన్ ఖాన్ కొనసాగుతున్నారు. ఆయన సినిమా వస్తోందంటే చాలు ప్రేక్షకులు పండగ చేసుకుంటారు. అయితే జీవిత పరంగా 50 ఏళ్లు దాటినా కూడా ఆయనకు ఇంకా పెళ్లి కాలేదు. సల్మాన్ ఖాన్ పెళ్లి చేసుకోకుండా డేటింగ్ చేస్తూనే ఉంటాడు. తన సినీ కెరీర్ స్టార్టింగ్ నుండి ఇప్పటి వరకూ చాలా మంది హీరోయిన్లతో ఆయన డేటింగ్ చేశాడు. మరి సల్మాన్ ఖాన్ డేటింగ్ చేసిన ఈ హీరోయిన్లు ఎవ్వరో ఇప్పుడు చూద్దాం.

 

షహీన్ జాఫ్రీ :
సల్మాన్ ఖాన్ ముందుగా సూపర్ స్టార్ అశోక్ కుమార్ మనవరాలు షహీన్ ని లవ్ చేశారు. చదువుకునే రోజుల్లోనే వీరి లవ్ ఎఫైర్ నడిచింది.

 

సంగీత బిజ్లానీ :
హీరోయిన్ సంగీత బిజ్లానీని సల్మాన్ లవ్ చేయడమే కాదు పెళ్లి కూడా చేసుకుంటానని అనౌన్స్ చేశారు. అయితే 1994, మే 27న వీరి పెళ్లి ఆగిపోయింది గానీ కారణం మాత్రం బయటకు రాలేదు.

 

సోమీ అలీ :
సల్మాన్ ఖాన్ సోమీ అలీతో డేటింగ్ చేశారు. ఏడేళ్లు వీరు రిలేషన్ లో ఉన్నారు. కానీ ఆ తర్వాత ఇద్దరూ వేరైపోయారు.

 

ఐశ్వర్య రాయ్ :
సల్మాన్ ఖాన్ తో డేటింగ్ వార్తల్లో ఎక్కువగా వినిపించిన పేరు ఐశ్వర్య అనే చెప్పాలి. ఈమె సల్మాన్ తో గొడవ పడి విడిపోయానని అప్పట్లో తెలిపారు.

 

కత్రినా కైఫ్ :
నాలుగేళ్ళ పాటు కత్రినాతో సల్మాన్ డేటింగ్ చేశాడు. అయితే రణబీర్ కోసం కత్రినా సల్మాన్ ను వదులుకున్నానని చెప్పింది.

 

క్లాడియా :
జర్మన్ నటి క్లాడియాతో సల్మాన్ డేటింగ్ చేసి ఆ తర్వాత విడిపోయారు.

 

స్నేహ ఉల్లాల్ :
స్నేహ ఉల్లాల్ తో కూడా సల్మాన్ డేటింగ్ లో ఉన్నట్లు అనేక వార్తలు వచ్చాయి.

 

మెహెక్ చాహల్ :
యూరోపియన్ నటి అయిన మెహెక్ బిగ్ బాస్ లో పాల్గొని ఆ తర్వాత సల్మాన్ తో డేటింగ్ చేసింది.

లులియా : రోమానియాకు చెందిన లులియా తో కూడా సల్మాన్ డేటింగ్ చేసి విడిపోయారు.

 

హేజల్ :
బ్రిటన్ కు చెందిన హేజల్ తో సల్మాన్ డేటింగ్ చేసి విడిపోగా ఆ తర్వాత ఆమెను యువరాజ్ సింగ్ వివాహం చేసుకున్నాడు.

 

డైసీ షా :
హిందీ, కన్నడ సినిమాల్లో నటించిన డైసీ షా సల్మాన్ తో డేటింగ్ చేసింది.

 

సోనాక్షి సిన్హా :
దబాంగ్ సినిమాతోనే హీరోయిన్ గా వచ్చిన సోనాక్షితో సల్మాన్ డేటింగ్ చేశారు. వీరు పెళ్లి చేసుకుంటారని వార్తలు కూడా షికారు చేశాయి.

 

పూజా హెగ్డే :
ప్రస్తుతం సల్మాన్ ఖాన్ ముద్దుగుమ్మగా పూజా హెగ్డేకు పేరుంది. ఈమెతో సల్మాన్ డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఓ సినిమాలో వీరిద్దరూ కలిసి నటిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -