Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ షోకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బిగ్ బాస్ షో వస్తోందంటూ చాలు జనాలంతా కూడా టీవీలకు అతుక్కపోతోంటారు. ఇక బిగ్ బాస్ కంటెస్టెంట్ల కోసం అభిమానులు నెట్టింట్లో చేసే హంగామా మామూలుగా ఉండదు. బిగ్ బాస్ షో కంటే.. బయట జరిగే సందడే ఎక్కువగా ఉంటుంది. లోపల ఒక ఆట నడుస్తుంటే.. బయట వారి వారి అభిమానులు ఇంకో ఆట నడిపిస్తుంటారు. అలా బిగ్ బాస్ అనేది ఓ హాట్ టాపిక్‌గా నడుస్తుంటుంది.
ఇక ఇప్పుడు ఆరో సీజన్‌కు సంబంధించిన ప్రోమోను వదిలారు. బిగ్ బాస్ ఆరో సీజన్ నేటి సాయంత్రం ఆరు గంటలకు గ్రాండ్‌గా ప్రారంభం కానుంది. ఇక ఇప్పటికే కంటెస్టెంట్ల లిస్ట్ బయటకు వచ్చింది. గత నాలుగైదు రోజుల క్రితమే అందరినీ క్వారంటైన్ నిమిత్తం స్టార్ హోటల్లో పెట్టేసిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఈ షోకు సంబంధించి అసలు సిసలు ప్రోమోను వదిలారు.
ఇందులో లేడీ కంటెస్టెంట్లతో నాగార్జున దుమ్ములేపేశాడు. వారి గుట్టు రట్టు చేసేందుకు ప్రయత్నించాడు. ఇక లోపలకు వెళ్తే తినే చాన్స్ ఉండదని, ఇప్పుడే తిను అంటూ పిజ్జా, బర్గర్లు పెట్టి చూపించాడు. పెళ్లి చేయాలా? బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్తావా? అని అడిగితే. పెళ్లి తప్పించుకోవడానికి ఇక్కడకు వచ్చావట కదా? అని నాగార్జున మరో కంటెస్టెంట్‌ను అడిగేశాడు.
ఇక చలాకీ చంటి వాయిస్ క్లియర్‌గా అర్థమవుతోంది. బిగ్ బాస్ ఇంట్లో సుర్రు సుమ్మైపోద్ది అంటూ చలాకీ చంటి అనేశాడు. నువ్ మంచి పాటగాడివే కాదు.. ప్లే బాయ్ అని కూడా విన్నాను అంటూ సింగర్ రేవంత్‌ను ఇరికించే ప్రయత్నం చేశాడు నాగ్.ఎందుకు సార్.. మా ఆవిడ చూస్తుంటుంది అని రేవంత్ తప్పించుకునే ప్రయత్నం చేశాడు. మొత్తానికి బిగ్ బాస్ ఆరో సీజన్ అదిరిపోయేలానే ఉంది.