Actress: పెళ్లి కాకుండానే పిల్లలను కంటానంటున్న నాగార్జున హీరోయిన్!

Actress: టాలీవుడ్ ప్రేక్షకులకు సీనియర్ అందాల తార టబు గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. కూలి నెంబర్ వన్ సినిమా ద్వారా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన టబు.. తొలి చిత్రంతోనే అప్పటి ప్రేక్షకులను ఒక రేంజ్ లో ఆకట్టుకుంది. అనంతరం నాగార్జునతో నిన్నే పెళ్లాడతా సినిమాలో నటించి.. తన అందంతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది.

అనంతరం చెన్నకేశవరెడ్డి, ఆవిడ మా ఆవిడే, పాండురంగడు, అందరివాడు, ప్రేమదేశం లాంటి సినిమాల్లో నటించి తెలుగు నాటనటంలో తనకంటూ చెరగని ముద్ర వేసుకుంది. మొత్తానికి టాలీవుడ్ లో ఒక ఊపు ఊపిన టబు.. ఆ టైంలో కుర్ర కారుని ఒక రేంజ్ లో ఆడించింది. ఇక తన వయసు మీద పడుతున్నప్పటికీ.. ఈ అమ్మడు మొన్నటి వరకు కూడా గ్లామర్ రోల్స్ చేసి.. ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

మొత్తానికి ఇటు టాలీవుడ్లో.. అటు బాలీవుడ్లో స్టార్ హీరోయిన్ గా మరో స్థాయిలో హడావిడి చేసిన ఈ అమ్మడు.. ఇంతవరకు వివాహం చేసుకోలేదు. తన విషయంలో ఎవరైనా నెగిటివ్ గా మాట్లాడితే.. వారికి వెంటనే రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేస్తుంది. ఇదిలా ఉంటే ఇటీవల టబు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది. ఒక ఇంటర్వ్యూలో ఈ బ్యూటీ మాట్లాడుతూ.. నాకు తల్లి కావాలని ఉంది. తల్లి అవ్వాలంటే పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు.

పెళ్లి జరగకుండానే గర్భం దాల్చవచ్చు అని చెప్పు తెలిపింది. అయితే ఆమె ఉద్దేశం సరోగసి ద్వారా కూడా తల్లి అయ్యే అవకాశం ఉంది అని.. కానీ అలాంటి ఆలోచనలు నేను చేయడం లేదు అని ఆ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ప్రస్తుతం తన నటన పరంగా చిల్ అవుతా అన్నట్లుగా మాట్లాడింది. ఇక టబు చేసిన కీలక వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ హడావిడి చేస్తున్నాయి. మరి మీరు ఎందుకు ఆలోచిస్తున్నారు.. మీరు కూడా వీడియో వైపు ఒక లుక్కేయండి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -