Avinash Reddy: ఆ విధంగా అవినాష్ రెడ్డికి బెనిఫిట్.. ఏం జరిగిందంటే?

Avinash Reddy: వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం మనకు తెలిసిందే. వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాష్ హస్తము ఉందంటూ ఆయన కుమార్తె సునీత ఆరోపణలు చేశారు. ఈ క్రమంలోనే ఈ కేసు దర్యాప్తులో భాగంగా సిబిఐ అధికారులు అవినాష్ ను అరెస్టు చేయడం కోసం రంగం సిద్ధం చేస్తూ ఉండగా అవినాష్ మాత్రం ముందస్తు బెయిల్ కోసం తెలంగాణ కోర్టును ఆశ్రయించిన విషయం మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే తెలంగాణ కోర్టు అవినాష్ రెడ్డిని ఏప్రిల్ 25వ తేదీ వరకు అరెస్టు చేయడానికి వీలు లేదంటూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ విషయంపై సునీత సుప్రీంకోర్టును ఆశ్రయించి తన ముందస్తు బెయిల్ రద్దు చేయాలని పిటిషన్ వేశారు. ఇక ఈ పిటిషన్ పై సోమవారం విచారణ జరిపిన సుప్రీంకోర్టు అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పై స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తుంది.

 

ఇలా సుప్రీంకోర్టు ఈ విధమైనటువంటి తీర్పు ఇవ్వడంతో తెలంగాణ కోర్టు వెంటనే అవినాష్ రెడ్డి పిటీషన్ ను కొట్టి వేస్తుందని భావించారు. ఈ విషయంపై నేడు విచారణ జరపాలని భావించిన తెలంగాణ కోర్టు సుప్రీంకోర్టు ఉత్తర్వుల పత్రి ఇంకా అందకపోవడంతో ఈ విచారణను రేపటికి వాయిదా వేసింది. ఈ క్రమంలోనే గురువారం మధ్యాహ్నం ఈ విషయం గురించి విచారణ చేపడతామని తెలంగాణ కోర్టు వెల్లడించింది.

 

నిజానికి సుప్రీంకోర్టు ఆదేశాలు మేరకు మంగళవారం అవినాష్ రెడ్డిని అరెస్టు చేయాల్సి ఉండగా సునీత సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడంతోనే అవినాష్ రెడ్డికి ఇలా ఉపశమనం కలుగుతుందనే చెప్పాలి. ఒక విధంగా సునీత సుప్రీంకోర్టును ఆశ్రయించి అవినాష్ రెడ్డికి చాలా మేలు చేస్తుందని తెలుస్తోంది. మరి రేపు మధ్యాహ్నం తెలంగాణ కోర్టులో ఈ పిటిషన్ పై విచారణ జరిపిన తెలంగాణ కోర్టు ఏ విధమైనటువంటి తీర్పును వెల్లడిస్తుందో తెలియాల్సి ఉంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -