Kadapa Politics: కడపలో మారుతున్న పొలిటికల్ లెక్కలు.. జగన్ కు మరిన్ని భారీ షాకులు తప్పవా?

Kadapa Politics: వైయస్ రాజశేఖర్ రెడ్డి వారసుడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయాలలోకి వచ్చే అధికారాన్ని అందుకొని ప్రస్తుతం ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు అయితే వైయస్ వారసురాలు వైయస్ షర్మిల మాత్రం గత ఎన్నికలలో తన అన్నయ్య గెలుపుకి ఎంతో కీలకంగా మారారు కానీ ఇటీవల వీరిద్దరి మధ్య వచ్చిన మనస్పర్ధలు కారణంగా ఈమె తన అన్నకు పోటీగా ఎన్నికలలోకి రాబోతున్నారు.

ఇకపోతే ప్రస్తుతం కాంగ్రెస్ పిసిసి అధ్యక్షురాలు కొనసాగుతున్నటువంటి వైయస్ షర్మిల జగన్మోహన్ రెడ్డి పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ విమర్శలు కురిపిస్తున్నటువంటి తరుణంలో వైసిపి నేతలు అసలు షర్మిల రాజశేఖర్ రెడ్డి గారి కుమార్తె కాదంటూ వైయస్ విజయమ్మ క్యారెక్టర్ ను ఎత్తిచూపేలా మాట్లాడుతున్నారు.

అంతేకాకుండా వైయస్ షర్మిల వైయస్ సునీత రెడ్డి కడపలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నటువంటి తరుణంలో వారి పట్ల సోషల్ మీడియా వేదికగా ఎంతో అభ్యంతరమైనటువంటి పోస్టులను పెట్టేలా ప్రోత్సహిస్తున్నారు. ఇలా తన సొంత కుటుంబ సభ్యుల పట్ల జగన్మోహన్ రెడ్డి ఇలా వ్యవహరించడం పట్ల ఉమ్మడి కడప జిల్లాలో జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ముఖ్యంగా కడప జిల్లా మహిళలలో సరికొత్త ఆలోచన తడుతుంది సొంత కుటుంబంలోని ఆడపిల్లల పట్ల ఇలాంటి చర్యలకు సిద్ధపడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి రేపు అధికారంలోకి వస్తే రాష్ట్ర ప్రజలు అలాగే మహిళల పట్ల ఎలా ఉన్నతంగా వ్యవహరిస్తారు సొంత చెల్లెళ్లకే ఇవ్వలేనటువంటి భద్రతా భరోసా ఇతర మహిళలకు ఏమిస్తారని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇలా తన చెల్లెల పట్ల జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు జగన్మోహన్ రెడ్డికి వచ్చే ఎన్నికలలో భారీ నష్టాన్ని కలిగిస్తుందని స్పష్టంగా తెలుస్తుంది.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జనసేన పార్టీ నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఆ నేతలు పాటిస్తారా?

Pawan Kalyan:  పవన్ కళ్యాణ్ లో ఇప్పుడు పరిపూర్ణ రాజకీయ నాయకుడు కనిపిస్తున్నాడు. పార్టీకి సంబంధించి అనేకమైన కీలక నిర్ణయాలను చాలా పరిణితితో తీసుకుంటున్నారు. పోలింగ్ రెండు వారాల్లో ఉంది కాబట్టి ఈ...
- Advertisement -
- Advertisement -