YS Avinash Reddy Vs YS Sunitha: అవినాష్ రెడ్డి వర్సెస్ వైఎస్ సునీత.. కడపలో వైసీపీ మునగటానికి ఇంకేం అక్కర్లేదా?

YS Avinash Reddy Vs YS Sunitha: కడప పార్లమెంట్ అభ్యర్థి వైయస్ అవినాష్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిపోయింది. 2019 ఎన్నికలకు ముందు వయసు వివేకానంద రెడ్డి దారుణంగా హత్యకు గురైన సంగతి తెలిసింది. అయితే ఈయన హత్య కేసులో అవినాష్ రెడ్డి ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వైయస్ వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డికి హస్తం ఉందని, అవినాష్ రెడ్డిని కాపాడటం కోసమే జగన్మోహన్ రెడ్డి సిబిఐ విచారణకు అంగీకరించలేదని వాదన కూడా వినిపిస్తుంది.

ఇక ఇదే విషయం గురించి వివేకానంద రెడ్డి కుమార్తె సునీత రెడ్డి జగన్మోహన్ రెడ్డి చెల్లెలు వైయస్ షర్మిల పెద్ద ఎత్తున కడపలో పర్యటిస్తూ వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి తీవ్రస్థాయిలో తన సోదరులపై విమర్శలు కురిపిస్తున్నారు. ఇక సునీత రెడ్డి సీబీఐ ఛార్జిషీట్‌లో పేర్కొన్న అంశాల్నే ప్రస్తావిస్తున్నారు. తన తండ్రి చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి సిబిఐ విచారణ చేయాలని కోరారు.

అప్పట్లో సీబీఐ విచారణ కోరిన వైఎస్ జగన్, అధికారంలోకి వచ్చాక, సీబీఐ విచారణ వద్దని ఎందుకు అనాల్సి వచ్చింది. అప్పట్లో సునీతకు అండగా నిలిచిన జగన్ ఇప్పుడు ఎందుకు ఆమెకు అండగా లేరని ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. ఇలా జగన్మోహన్ రెడ్డి విషయం పక్కనపెట్టి అవినాష్ విషయానికి వస్తే అవినాష్ ఒక వైపు షర్మిల మరోవైపు సునీత భారీ స్థాయిలో విమర్శలు చేస్తూ ఉన్నారు.

తన రాజకీయ భవిష్యత్తు కోసమే తన తండ్రిని చంపారని సునీత బహిరంగంగా తెలియజేస్తూ వచ్చారు. ఇలాంటి హంతకుడుకి ఓట్లు వేసి గెలిపించాలా అంటూ మరోవైపు షర్మిల అవినాష్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఇలా తన గురించి ఎన్ని విమర్శలు చేసిన ఇప్పటివరకు మాట మాట్లాడని అవినాష్ మొదటిసారి తన అనుకూల మీడియా ముందుకు వచ్చి వివేకానంద రెడ్డిని సునీత తన భర్త చంపారనే అర్థం వచ్చేలా మాట్లాడారే తప్ప ఎక్కడ సరైన ఆధారాలను మాత్రం చూపించలేకపోయారు.

ఈ విధంగా షర్మిల సునీత చేస్తున్నటువంటి విమర్శలు పట్ల కడప పార్లమెంటు పరిధిలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ఈ సంఘటనలే అవినాష్ రెడ్డి రాజకీయ భవిష్యత్తుకు సమాధి కడతాయని తెలుస్తోంది. ఈయనని ఓటమిపాలు చేయడానికి మరే ఇతర అంశాలు అవసరం లేదని స్పష్టంగా తెలుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

AP Roads: ఏపీలో రోడ్ల పరిస్థితిని చూపించి ఓట్లు అడిగే దమ్ముందా.. వైసీపీ నేతల దగ్గర జవాబులున్నాయా?

AP Roads:  ఒక రాష్ట్రం అభివృద్ధి బాటలో నడవాలి అంటే ముందుగా ఆ రాష్ట్రంలో మౌలిక సదుపాయాలన్నీ కూడా సక్రమంగా ఉండాలి మౌలిక సదుపాయాలు అంటే రోడ్లు కరెంట్ నీరు వంటి వాటివి...
- Advertisement -
- Advertisement -