Amala Akkineni: కాకి పిల్ల కాకికి ముద్దు.. ఏజెంట్ మూవీపై అమల రివ్యూ ఇదే!

Amala Akkineni: అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఏజెంట్ సినిమా ఏప్రిల్ 28వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను సందడి చేయలేక పోయిందని చెప్పాలి దీంతో పెద్ద ఎత్తున ఈ సినిమా గురించి ట్రోల్స్ మొదలయ్యాయి. కథలో కంటెంట్ లేకపోయినా భారీగా ప్రమోషన్లు చేసి సినిమాకి హైప్ తీసుకోవచ్చారు. దీంతో ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ కావడంతో భారీగా ఈ సినిమా ట్రోల్ చేస్తున్నారు.

సాధారణంగా ఒక హీరో సినిమా విడుదలందంటే ఒక వర్గం వారు ట్రోల్ చేయడం సర్వసాధారణం. ఇలాంటి ట్రోల్స్ స్టార్ హీరోల సినిమాలకు కూడా వస్తుంటాయి.
అయితే తాజాగా అఖిల్ ఏజెంట్ సినిమా గురించి కూడా ఇలాంటి ట్రోల్స్ వస్తున్న నేపథ్యంలో అమల ఈ ట్రోల్స్ పై స్పందిస్తూ చేసినటువంటి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 

ఈ సందర్భంగా అమల స్పందిస్తూ నేను ఏజెంట్ సినిమాని చూశాను నాకు చాలా బాగా నచ్చింది. ఇందులో కొన్ని తప్పులు ఉన్న ఓపెన్ మైండ్ తో చూస్తే సినిమా అర్థం అవుతుందని తెలిపారు.నేను సినిమా చూస్తూ బాగా ఎంజాయ్ చేశాను.నేను వెళ్ళిన థియేటర్
మొత్తం జనాలు ఉన్నారు. మహిళలు,పిల్లలు అందరూ సినిమా చూస్తూ బాగా ఎంజాయ్ చేశారు. యాక్షన్ సన్నివేశాలు వచ్చినప్పుడు అందరూ ఎంజాయ్ చేశారు. రానున్న మరో సినిమా ఇంతకన్నా పెద్దగా, బెటర్ గా ఉండబోతుందని అమల తెలిపారు.

 

ఇలా సమంత అఖిల్ ఏజెంట్ సినిమా గురించి చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అయితే ఈ కామెంట్స్ పై నెటిజన్స్ స్పందిస్తూ కాకిపిల్ల కాకికి ముద్దు అంటారు.అలా అఖిల్ తన కొడుకు కావడంతో ఆయన నటించిన సినిమా అమల గారికి నచ్చి ఉంటుందని మరికొందరు అమల పోస్ట్ పై కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం అమల చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -