Thalapathy vijay: వెంకట్ ప్రభు సినిమాకు విజయ్ ఆ రేంజ్ లో రెమ్యునరేషన్ అడిగారా?

Thalapathy vijay: సినిమా ఇండస్ట్రీలో హీరోలు రెమ్యూనరేషన్ లను అమాంతం పెంచేస్తున్నారు. రెమ్యూనరేషన్ లు టాప్ లేచిపోయే రేంజ్ కు వెళ్ళిపోతున్నాయి. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళంలో కూడా ఇదే పరిస్థితి. తమిళ స్టార్ హీరో అయిన విజయ్ ఇటీవల నటించిన సినిమా వారసుడు. తమిళంలో వారీసు పేరుతో విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమాకు దాదాపుగా రూ.100 కోట్ల రెమ్యూనరేషన్ ని తీసుకున్నారట విజయ్.

ఇది ఇలా ఉంటే తాజాగా అందిన సమాచారం ప్రకారం విజయ్ తన రికార్డును తానే బ్రేక్ చేయాలని చూస్తున్నారట. ఈ క్రమంలోనే ఒక సినిమాకు దాదాపుగా 150 కోట్ల పారితోషికానికి ఓకే చేశారని వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. వెంకట్ ప్రభు దర్శకత్వంలో రాబోతున్న ఒక సినిమా చేయడానికి విజయ్ ఓకె చెప్పినట్లు తెలుస్తోంది. ఎజిఎస్ సంస్థ ఈ సినిమాను నిర్మించనుంది. ఈ సినిమా కోసం విజయ్ కు ఏకంగా 150 కోట్లు రెమ్యూనిరేషన్ ఆఫర్ చేసారని తెలుస్తోంది. విజయ్ తో సినిమా చేస్తే, హిట్, ఫ్లాప్, యావరేజ్ అనే విషయంతో సంబంధం లేకుండా మంచి లాభాలు వస్తున్నాయి.

 

కేవలం నాన్ థియేటర్ హక్కుల మీదే వస్తోంది. దాంతో విజయ్ రెమ్యూనిరేషన్ ను అమాంతం పెంచేస్తున్నాడు. ఈ రేంజ్ లో రెమ్యూనరేషన్ అందుకుంటున్న సౌత్ ఇండస్ట్రీ హీరోలలో విజయ్ నెంబర్ వన్ హీరోగా నిలిచాడు. ఈ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో చాలామంది అభిమానులు షాక్ అవుతున్నారు.. ఇకపోతే తెలుగులో ఆ రేంజ్ లో పారితోషికం అందుకుంటున్న హీరో ఎవరు అంటే ప్రభాస్ పేరు వినిపిస్తోంది. మొన్నటి వరకు పారితోషకం విషయంలో నెంబర్ వన్ హీరో పేరు ప్రభాస్ పేరు వినిపించగా ఇప్పుడు విజయ్ పేరు వినిపిస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -