Niharika: ఆ సినిమాకు నో చెప్పడమే నిహారిక కెరీర్ పాలిట శాపమైందా?

Niharika: మెగా బ్రదర్ నాగబాబు ముద్దుల కూతురు నిహారిక గురించి మనందరికీ తెలిసిందే. గత కొంతకాలంగా నిహారిక పేరు సోషల్ మీడియాలో మారుమోగుతూనే ఉంది. ఆమె చాలా గ్యాప్ తరువాత ఒక వెబ్ సిరీస్ లో నటించడంతో ఆ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా ఈ ముద్దుగుమ్మ పేరు నెట్టింట వైరల్ అవుతూనే ఉంది. మొదట యాంకర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్న నిహారిక ఆ తర్వాత ఒక మనసు సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.

ఈ సినిమా తర్వాత రెండు సినిమాలలో నటించినప్పటికీ అవి ఆశించిన స్థాయిలో గుర్తింపుని తెచ్చిపెట్టలేకపోయాయి. కాగా సినిమాల ద్వారా అంతగా గుర్తింపు రాకపోవడంతో సినిమా ఇండస్ట్రీకి కొంతకాలం బ్రేక్ ఇచ్చింది. ఈ ముద్దుగుమ్మ 2020లో జొన్నలగడ్డ చైతన్యని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. నిహారిక చైతన్యల పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. పెళ్లి అయిన తర్వాత కూడా నిహారిక ఏమాత్రం తగ్గడం లేదు. అదే ఊపుతో అల్లరి చేస్తూ తరచూ సోషల్ మీడియాలో నిలుస్తూనే ఉంది. కాగా తాజాగా ఒక వెబ్ సిరీస్ తో ప్రేక్షకులను పలకరించినప్పటికీ ఆ వెబ్ సిరీస్ అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

 

ఇకపోతే నిహారిక హీరోయిన్ గా కేవలం మూడు సినిమాలలో మాత్రమే నటించిన విషయం తెలిసిందే. కానీ ఈ ముద్దుగుమ్మకు సూపర్ హిట్ మూవీలో నటించే అవకాశం రాగా దానిని రిజెక్ట్ చేసిందట. ఆ సినిమా మరేదో కాదు తిరుమ‌ల‌ కిషోర్ దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా నటించిన నేను శైలజ‌. ఈ సినిమాలో మొదటిగా నిహారికనే హీరోయిన్ గా అనుకున్నారట. ఏవో కారణాలతో నిహారిక ఈ సినిమాను రిజెక్ట్ చేసింది. కాగా ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్గా నటించిన విషయం తెలిసిందే.. అప్పట్లో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా కనుక నిహారిక చేసి ఉంటే ఆమె నిజంగా స్టార్ హీరోయిన్ అయి ఉండేదేమో అని నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -