Lakshmi Devi: లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలంటే చేయాల్సిన పని ఇదేనా?

Lakshmi Devi: ఈ రోజుల్లో చాలామంది వాస్తు విషయాలను పాటిస్తున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా ప్రస్తుత రోజుల్లో రోజురోజుకీ వాస్తు విషయాలు నమ్మి వారి సంఖ్య అంతకంతకు పెరుగుతూ ఉంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. మనం అనుభవించే ఆర్థిక కష్టాలకు బాధలకు వాస్తు విషయాలు కూడా ఒక రకంగా కారణమని చాలా మందికి తెలియదు. అందుకే వాస్తు ప్రకారం అనుసరించడం వలన అంతా శుభమే జరుగుతుంది. సమస్యలన్నీ కూడా పోతాయి. ప్రతికూల శక్తి పోతుంది. నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగి, సంతోషంగా ఉండవచ్చు.

వాస్తు ప్రకారం మన ఇంట్లో సామాన్లని పెట్టుకుంటే మంచిది. ముఖ్యంగా వాస్తు ప్రకారం బీరువా ఏ దిశలో ఉండాలి అనేది ప్రతి ఒక్కరు చూసుకోవాలి. మరి బీరువాను ఇంట్లో ఏ దిశగా పెట్టాలి? ఏ దిశగా పెట్టడం వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అన్న విషయానికి వస్తే… ఎప్పుడూ కూడా బీరువాని ఇంట్లో పెట్టేటప్పుడు, తూర్పు దిక్కులో పెట్టకూడదు. అప్పుడు చెడు జరిగి సమస్యలు మరింత ఎక్కువ అవుతాయి. బీరువాని ఉత్తర వాయువ్యంలో ఉంచితే మంచిది. ఎందుకంటే వాయువ్యం చంద్రునిది. ఆయన ధన ప్రవాహానికి అధిపతి. కాబట్టి మనం బీరువాలో డబ్బు, నగలు వంటివి ఉంచుకుంటాం కాబట్టి, ఉత్తర వాయువ్యంలో ఉంచితే మంచిది. నైరుతి వైపు కూడా మీరు మీ బీరువాని పెట్టవచ్చు.

 

అలా పెట్టినట్లయితే కేవలం బట్టల్ని మాత్రమే ఉంచాలి. బంగారం, డబ్బు వంటివి పెట్టకూడదు. దక్షిణ దిక్కులో బీరువాని పెట్టడం అంటే, తెరిచినప్పుడు అది ఉత్తర వైపు ఉండాలన్నమాట. ఇలా కనుక మీరు వాస్తు విషయాలను పాటిస్తే ధన నష్టం కలగదు. ఒకవేళ అలా కనుక కుదరకపోతే ఉత్తర దిక్కుకి బుధుడు అధిపతి. బుధుడు సంపదలకు అధిపతి కాబట్టి ఉత్తరదిక్కు మధ్య భాగంలో కూడా మీరు పెట్టవచ్చు. దక్షిణ ముఖాన్ని బీరువా చూస్తూ ఉండాలి. నైరుతి వైపు అస్సలు పెట్టకండి. అలా చేస్తే ఎంత డబ్బు వచ్చినా కూడా అది సరిపోదు. కాబట్టి ఉత్తర వాయువ్యంలో కనుక బీరువాని పెట్టి, ధనం, నగలు ఉంచితే, మీ డబ్బు ఖర్చు అవ్వదు. మీరు కూడా అభివృద్ధి చెందుతారు.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -